పదవ తరగతి వార్షిక పరీక్షలు జరుగుతున్న నిర్మల హృదయ స్కూల్ ను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శనివారం పరిశీలించారు. పరీక్షలు నిర్వహిస్తున్న అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఎక్కడ కూడా లోపాలు ఉండకుండా పర్యవేక్షణ చేయాలని అన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS యాక్ట్ -2023 అమలులో ఉంటుందని, అన్ని పరీక్ష కేంద్రాలవద్ద ఎలాంటి అవంచనియా సంఘటనలు జరుగకుండా జిల్లా పోలీస్ శాఖ పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు.
అలాగే స్పార్ట్ వాల్వేషన్ జరుగుతున్న నిర్మల హృదయ స్కూల్ సందర్శించి పరిశీలించారు.
