HomeTelanganaNizamabadవడగండ్ల వాన వల్ల నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలి....-. గంగాకావేరి సిడ్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి...

వడగండ్ల వాన వల్ల నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలి….-. గంగాకావేరి సిడ్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి శి వి. ప్రభాకర్ డిమాండ్

వడగండ్ల వాన వల్ల నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని రైతంగానికి టోపీ పెట్టిన గంగాకావేరి సిడ్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అఖిలభారత ఐక్యరైతు సంఘం(ఏ.ఐ.యు. కే.ఎస్.)రాష్ట్ర ప్రధానకార్యదర్శి వి. ప్రభాకర్ డిమాండ్ చేశారు.

శనివారం నాడు సిరికొండ మండలంలోని కొండూరు, తదితర గ్రామాల్లో వడగళ్ళ వాన తో నష్ట పోయిన పంటలను పరిశీలించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు: వడగళ్ల వానతో మండలంలోని రైతులు పంటలు తీవ్రంగా దెబ్బతిని నష్టపోయారన్నారు. అసలే భూగర్భ జలాలు అడుగంటి పంటలు ఎండి పోతున్నాయని వడగళ్ల వాన రైతును మరింత నష్టం చేసిందన్నారు.

గత నాలుగేల్లుగా ప్రతి సంవత్సరం వడగండ్ల వానతో నష్టపోయిన గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మొండిచేయి చూపుతున్నాయన్నారు. సిరికొండ మండలంలో మొత్తం 500 నుండి 1500 ఎకరాల వరకు పంటలు నష్టపోయాయన్నారు.

మామిడికాయ రాలిపోయి రైతాంగం తీరమైన ఆర్థిక ఇబ్బందుల గురయ్యారన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి రూ 70 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలన్నారు. నష్ట పరిహారంతో పాటు రుణమాఫీ, రైతు భరోసా అందించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

కొండూరు గ్రామంలో వరి సీడ్స్ అందజేసి,మోసం చేసిన గంగా కావేరి సీడ్స్ యజమానియంపై చట్టరీత్యా చర్యలు తీసుకొవాలని కంపెనీ నుండి అందించిన సీడ్స్ 120 రోజుల్లో పంట చేతికొస్తదని నమ్మించారని 140 రోజులు అయిన ఇంకా పంట చేతికి రాలేదన్నారు.

పంటలను పరిశీలించిన వారిలో పి రామకృష్ణ, ఏ.ఐ.యు.కే.ఎస్ రాష్ట్ర కార్యదర్శి బి దేవరాం,జిల్లా సహాయ కార్యదర్శి బి బాబాన్న సిపిఐ(ఎంల్) మాస్ లైన్ డివిజన్,మండల నాయకులుబి కిషన్ సిపిఐ(ఎంల్) మాస్ లైన్ ఎం. డి.అనిస్ ,బి కిషోర్, ఎస్.కిషోర్, రైతులు జనార్దన్, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments