కాంగ్రెస్ అధిష్టానం ఎట్టకేలకు మంత్రి వర్గ విస్తరణ కసరత్తులు పూర్తీ చేసింది. సామాజిక సమీకరణలకే ప్రాధాన్యత ఇచ్చింది. కానీ ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయనేది ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. ఎవరికి మంత్రి పదవులు ఇతర కీలక పదవులు ఇవ్వాలనేది స్వయంగా రాహుల్ గాందీ దిశా నిర్దేశం చేశారు.
సామజిక సమీకరణ సంగతి ఎలా ఉన్న మంత్రి వర్గ విస్తరణలో ఈసారి జిల్లాకు ప్రాతినిధ్యం వుంటుందా లేదా అనేది ఉత్కంఠ గా మారింది. మాజీ మంత్రి సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కి ఎలాగైనా మంత్రి పదవీ ఇవ్వాలని సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దల వద్ద పట్టుబడుతున్నారు.
కేవలం ఒకే ఒక్క మంత్రి పదవీ కోసమే రేవంత్ రెడ్డి పట్టుబడుతున్నారు. కానీ సుదర్శన్ రెడ్డి కి ఈసారి సామజిక సమీకరణే శాపంగా మారింది. కులగణన తెరమీదికి రావడంతో బిసి యస్సి ఎస్టీ లకు సముచిత ప్రాధాన్యత ఇవ్వడం కాంగ్రెస్ పెద్దలకు అనివార్యంగా మారింది.
అందుకే కనీసం ఇద్దరు బిసి లకు క్యాబినెట్ లోకి తీసుకోవాలనేది అధిష్టానం చెప్తున్నా మాటగా ఉంది. సామాజిక సమీకరణాలు ఎలా ఉన్న జిల్లాకు ప్రాతినిద్యం ఇస్తే సుదర్శన్ రెడ్డి తప్పా మరో పేరే అధిష్టానం వద్ద లేదు.
కానీ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సొంత జిల్లా కావడంతో అధిష్టానం ఆయన అభిప్రాయం ను పరిగణలోకి తీసుకునే ఛాన్స్ ఉంది.దీనితో మహేష్ ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ప్రతి సారి జిల్లాకు మంత్రి పదవీ దక్కింది.
జిల్లా చరిత్ర లో మొదటి సారిగా ఏడాదిన్నర కాలంగా జిల్లాకు మంత్రి పదవే దక్కడం లేదు. జిల్లాకు రెండు సార్లు ఆర్థిక శాఖ దక్కింది. రాజారాం సంతోష్ రెడ్డి.
బాలాగౌడ్ డీఎస్ షబ్బీర్ అలీ లాంటి నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంలో అత్యంత కీలక శాఖలే దక్కాయి సురేష్ రెడ్డి ఏకంగా స్పీకర్ పదవీ దక్కింది.కానీఈసారిమొదటి దఫా లో నే ఉమ్మడి జిల్లా నుంచి మంత్రి పదవీ దక్కక పోవడంతో కాంగ్రెస్ శ్రేణులు నిరాశ చెందాయి.
జిల్లాకు మంత్రి లేకపోవడంతో పాలనా వ్యవస్థ ను గాడి లో పెట్టేవారే లేకుండా పోయారు. సామజికసమీకరణ సంగతి ఎలా ఉన్న ఈసారి జిల్లాకు క్యాబినెట్ లో ప్రాతినిధ్యం ఇవ్వాలని కాంగ్రెస్ శ్రేణులు బలంగా కోరుతున్నాయి
