పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సొంత జిల్లాలోనే పార్టీ పదవుల భర్తీ లో ఎడతెగని జాప్యం కొనసాగుతుంది. జిల్లా అధ్యక్షుడిగా మానాల మోహన్ రెడ్డి, నగర అధ్యక్షుడు కేశ వేణు లు దాదాపు ఏడాది కాలంగా జోడు పదవుల మీద స్వారీ చేస్తున్నారు.
ప్రతికూల పరిస్థితుల్లో పార్టీలో క్రియాశీలకంగా పనిచేసారు.దిగ్గజ నేతలతో సమన్వయం లోపం రాకుండా పనిచేసారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరూ టికెట్ కోసం గట్టిగానే లాబీయింగ్ చేశారు.
కానీ నిరాశే ఎదురైంది. రేవంత్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి లాంటినేతలు భవిష్యత్తు భరోసా ఇవ్వడంతో మరింత గట్టిగా పనిచేసారు ఏళ్ల తరబడిగా పార్టీ బాధ్యతల్లో ఉన్న వారికి అధికారంలోకి రాగానే రేవంత్ సర్కార్ నామినేటెడ్ పదవులు కట్టబెట్టింది. మానాల మోహన్ రెడ్డి కి కార్పొరేషన్ ఛైర్మెన్ పదవి దక్కగా కేశ వేణు నుడా ఛైర్మెన్ గా నియామకం అయ్యారు.ఈ మేరకు ఆయా పదవుల్లో ఇమిడి పోయారు.
అక్కడా క్రియాశీలకంగా పనిచేస్తున్నారు.మానాల హైదారాబాద్ కే పరిమితం అవుతున్నారు. అడపా దడపా జిల్లాకు వస్తున్న అదికూడా బాల్కొండ కే వెళ్తున్నారు. ఆయన జిల్లా కాంగ్రెస్ భవన్ కు చుట్టపు చూపుగా మారారు.పూర్తీ స్థాయిలో పార్టీ కార్యకలాపాల్లో ఉండలేక పోతున్నారు.
దాదాపు కేశ వేణు పరిస్థితి అంతే. నుడా లో పూర్తీ స్థాయిలో సమయం వెచ్చిస్తున్నారు. దీనితో పార్టీలో పూర్తీ స్థాయి లో క్రియాశీలకంగా పనిచేసే వారే లేకుండా పోయారు. ఈ నేపథ్యంలోనే జిల్లాకు చెందిన మహేష్ గౌడ్ కు పీసీసీ పగ్గాలు దక్కాయి.
దీనితో పార్టీలో సంస్థాగత మార్పులు ఆయన సొంత జిల్లా నుంచే మొదలయ్యే అవకాశం వుంటుందనే చర్చ పార్టీ వర్గాల్లో ఉంది. కానీ నెలలు గడుస్తున్నా పార్టీలో పదవుల పందేరం మొదలు కాక పోవడంతో ద్వితీయ శ్రేణి నేతల్లో అసహనం వ్యక్తం అవుతుంది.జిల్లా పార్టీలో తనదైన ముద్ర కోసం మహేష్ కీలక పదవుల్లో తన సన్నిహితులకు అవకాశం వచ్చేలా చక్రం తిప్పుతారని అంత భావించారు.
మహేష్ రాష్ట్ర స్థాయి వ్యవహారాల్లోనే బిజీగా వుంటున్నారు. తరుచు ఢిల్లీ బాట పడుతున్నారు. దీనితో ఆయనకు జిల్లా పార్టీ వ్యవహారాలను పట్టించుకునే తీరిక లేకుండా పోయింది. దీనితో పార్టీ పదవుల మీద గంపెడు ఆశలు పెట్టుకున్న నేతలో అసంతృప్తి నెలకొంది.ఎలాగో నామినేటెడ్ పదవుల పందేరం లో జిల్లా కోట పూర్తీ అయింది.కనీసం పార్టీ పదవులైన దక్కించుకోవాలని సీనియర్ నేతలు దిగ్గజ నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.
పీసీసీ చీఫ్ గా ఉన్న మహేష్ గౌడ్ కు జిల్లా పార్టీ లో కనీస పట్టు లేదు బలమైన నేతలెవ్వరూ ఆయన వర్గీయులుగా లేరు. అందుకే ఈసారి పార్టీ పదవుల నియామకం లో తనదైన ముద్ర వుండాలనే పట్టుదలతో మహేష్ వున్నారు. అందుకే నియామకాల్లో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
ఈపాటికే డీసీసీ అధ్యక్ష పదవీ కోసం అర డజన్ మంది నేతలు క్యూ కట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో డీసీసీ పదవీ అత్యంత కీలకంగా భావిస్తున్నారు.మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత, శేఖర్ గౌడ్ లతో పాటు వినయ్ రెడ్డి నగేష్ రెడ్డి ఈ రేసులో ఉన్నారు.
వీరిలో నగేష్ రెడ్డి వినయ్ రెడ్డి లు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి వర్గీయులుగా బలమైన ముద్ర ఉంది. అందులో ఈసారి బిసి నేటికీ డీసీసీ పగ్గాలు ఇవ్వాలని మహేష్ భావిస్తున్నారు. ఇద్దరు ఎమ్మెల్యే లు ఇద్దరు నియోజకవర్గ ఇంచార్జ్ లతో పాటు రెడ్డి సామజిక వర్గం కు చెందిన వారున్నారు.
రాబోయే రోజుల్లో సుదర్శన్ రెడ్డి మంత్రి కూడా అయ్యే ఛాన్స్ ఉంది.అందుకే డిసిసి పగ్గాలు బిసి ఇవ్వడం సామజిక సమతూకంగా వుంటుంది.అందులోనూ ప్రస్తుత డిసిసి మానాల మోహన్ రెడ్డి దాదాపు పదేళ్లు ఈ పదవిలో కొనసాగుతున్నారు.
మళ్ళీ అదే సామజిక వర్గం కు ఇవ్వడానికి మహేష్ ఆసక్తి చూపించిక పోవచ్చని ఆయన సన్నిహితులు చెప్తున్నారు.
