ఒకరి పరిస్థితి విషమం..గుర్తు తెలియని వాహనం ఢీ కొని పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మాక్లూర్ మండలంలోని మాణిక్ భండార్ చౌరస్తాలో శుక్రవారం చోటు చేసుకుంది.స్థానికుల సమాచారం మేరకు..
వర్ని మండలం తగిలేపల్లి గ్రామానికి చెందిన ముగ్గురి ద్విచక్ర వాహనం పై మాణిక్ భండార్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్నా క్రమంలో గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీ కొనడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
అందులో ఒకరి పరిస్థితి విషమం ఉందని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
