HomeTelanganaNizamabadముంచుకొస్తున్న ముహూర్తం ...క్యాబినెట్ బెర్త్ ఫై తొలగని ఉత్కంఠ ......గవర్నర్ తో సీఎం భేటీ తో...

ముంచుకొస్తున్న ముహూర్తం …క్యాబినెట్ బెర్త్ ఫై తొలగని ఉత్కంఠ ……గవర్నర్ తో సీఎం భేటీ తో పెరిగిన హీట్ …….జిల్లా కు మంత్రి పదవీ కొనసాగుతున్న సస్పెన్స్

మంత్రి వర్గ విస్తరణ ఫై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. అధిష్టానం క్యాబినెట్ విస్తరణ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్తున్నారు. రేవంత్ కూడా ఏప్రిల్ మూడో తేదీకి ముహూర్తం కూడా కుదిరిందని ప్రచారం జరుగుతుంది.

కానీ పార్టీ లేదా ప్రభుత్వ పెద్దల నుంచి ఎలాంటి క్లారిటి రాలేదు. కానీ ఆదివారం ఉగాది పర్వదినం నాడే రాష్ట్ర గవర్నర్ ను సీఎం రేవంత్ కలవడం తో క్యాబినెట్ విస్తరణ ఫై మరింత హీట్ పెరిగింది. ముందు వెనుక కానీ క్యాబినెట్ విస్తరణ దాదాపు ఖాయం అయింది.

దీనితో జిల్లాకు ఈసారైనా మంత్రి పదవి దక్కుతుందా ?లేదా ?అనేది ఎటూ తేలడం లేదు. జిల్లా కు మంత్రి మండలి లో ప్రాతినిధ్యం లేదు. అందుకే ఈసారి మంత్రి పదవి దక్కుతుందనే ఆశాభావం తో అధికార పార్టీ నేతలు ఉన్నారు. కానీ అధికార పార్టీ కీలక నేతలు కూడా మంత్రి పదవీ ఉందా లేదా అనేది స్పష్టంగా చెప్పలేక పోతున్నారు.

విస్తరణ జరిగితే బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కి మంత్రి పదవి ఖాయమని మొదటి నుంచి ప్రచారం జరుగుతుంది. అందులోనూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినా ముగ్గురు ఎమ్మెల్యే లూ మొదటి సారి గెలిచినా వారే ! అందుకే సుదర్శన్ రెడ్డి ని కాదని మరొకరికి మంత్రి పదవీ అవకాశం దక్కే ఛాన్స్ లేదు.

అదీగాక సుదర్శన్ రెడ్డి రేవంత్ కు సన్నిహితులుమిగితా నేతల సంగతి ఎలా ఉన్నా సుదర్శన్ రెడ్డి కోసం ఆయన ఢిల్లీ పెద్దలతో పట్టుబడుతున్నారు. కానీ సామజిక సమీకరణ లే సుదర్శన్ రెడ్డి ప్రతికూలంగా ఉన్నాయ్. రాజగోపాల్ రెడ్డి మాల్ రెడ్డి రంగా రెడ్డి లు మంత్రి పదవి రేసు లో ఉన్నారు.

రెడ్డి లకు ఎడా పెడ మంత్రి పదవులు ఇవ్వడానికి అధిష్టానం ఆసక్తిగా లేదు. అన్ని సామాజిక వర్గాలకు సముచిత స్థానం ఇవ్వాలనేది అధిష్టానం ఆలోచనగా ఉంది. తమకు మంత్రి పదవులు ఇవ్వాలని మరో వైపు మాదిగ ఎస్టీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యే లు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు.

అందుకే జిల్లాకు మంత్రి పదవీ ఇస్తే ఎవరికి అవకాశం ఇస్తారనేది అధికార పార్టీ లో ఆసక్తి గా మారింది. మూడు న ముహూర్తం ఖరారు అయినట్లు చెప్తున్నపటికి జిల్లా నుంచి ఎవరికి ఇస్తారనేది పార్టీ వర్గాలకు ఎలాంటి సంకేతాలు రాలేదు. ఎవరికి సీఎంవో నుంచి పిలుపు వస్తుందో ననేది ఉత్కంఠ గా మారింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments