ముస్లిం ల పవిత్ర మాసం రంజాన్ పండగ సోమవారం జరగనుంది. ఆదివారం చంద్రడి దర్శనం కావడంతో సోమవారం పండగ జరుపుకోవాలని మత పెద్దలు ప్రకటించారు.
ముప్పై రోజుల పాటు చేసిన ఉప వాస దీక్ష లను ముస్లిం లు ఆదివారం ముగించారు.సోమవారం రంజాన్ పండగ నేపథ్యం లో పోలీసులు పటిష్టమైన బందోబస్త్ ఏర్పాటు చేసారు. కమిషనర్ సాయి చైతన్య ఆదివారం
సాయంత్రం సమయంలో నిజామాబాద్ డివిజన్ పరిధిలో గల ఈద్గా లను మరియు మసీద్ లను సందర్శించారు .ఇందులో భాగంగా 5 వ టౌన్ పరిధిలో ని శాంతి నగర్ ఈద్గా ను పర్యవేక్షించారుఈ సందర్బంగా పోలీస్ కమీషనర్ ఈద్గా పెద్దలతో మాట్లాడడం జరిగింది.
మరియు ఈద్గాలు మరియు మసీద్ లను మొత్తం తిరిగి తెలుసుకున్నారు . నిజామాబాదు డివిజన్. పరిధిలో దాదాపు 450 మంది పోలీస్ సిబ్బంది తో పటిష్టమైన బందొబస్త్ ఏర్పాటుచేశారు పటిష్టమైన నిఘా వ్యవస్థ సైతం ఏర్పాటు చేసారు ముఖ్యమైన సీపీ వెంట నిజామాబాద్ ఏ.సి.పి రాజా వెంకట్ రెడ్డి, ట్రాఫిక్ ఏ.సి.పి శ్రీ. నారాయణ, ఈద్గా పెద్దలు అబ్దుల్ రెహమాన్, ప్రెసిడెంట్ , రఫీక్ బాయ్ , హైసన్ పాషా, వాషిమ్ భాయ్ తదితరులు కమిటీ మెంబర్స్ లున్నారు
