దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషులకు కింది కోర్టు ఇచ్చిన ఉరిశిక్ష నే ఖరారు చేసింది. మొత్తం ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ మంగళవారం తుది తీర్పు చెప్పింది.
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసులో హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందోననేది ఉత్కంఠ గా ఉండే. ఈ తీర్పు నేపథ్యంలో హైదారాబాద్ నగరంలో పోలీస్ శాఖ అప్రమత్తం అయింది, 2013 ఫిబ్రవరి 21వ తేదీన దిల్‌సుఖ్‌నగర్‌లో భారీ పేలుళ్లు జరిగాయి .
సరిగ్గా పదేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనలో అనేక మంది అమాయక ప్రజలు అసువులు బాసారు . ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్ర సంస్థ టిఫిన్ బాక్సులో బాంబులు పెట్టి ఈ పేలుళ్లకు పాల్పడింది. ఈ ఘటనలో 18 మంది మృతి చెందగా 131మందికి పైగా గాయపడ్డారు.
కేసులో నిందితులు గా అసదుల్లాహ అక్తర్.,యాసిన్ భత్కల్ ,,తహసిన్ అక్తర్.,జియావుర్ రెహ్మాన్.ఎజాక్ షాయిక్. లతో పాటు మరో 14 మంది మీద అభియోగాలు నమోదు చేసింది. యన్ ఐ ఏ ప్రత్యేక కోర్టు లో సుదీర్ఘ విచారణ జరిగింది.
భత్కల్ తో పాటు మరో నిందితులను ఇప్పటికి యన్ ఐ ఏ పట్టుకోలేక పోయింది.2016లోనే ఉరి శిక్ష విధించగా తీర్పుపై హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు ఇవాళ తుది తీర్పు వెలువరించింది.
దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత హైకోర్టు సైతం ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్ధించి దోషులకు ఉరిశిక్ష ను ఖరారు చేసింది.
