హత్య కేసులో ఒకరికి జీవిత ఖైదు, రూ 2000 జరిమానా విధిస్తూ న్యాయ మూర్తి టి.శ్రీనివాస్ తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళ్లితే.
నగరంలోని చంద్రశేఖర్ కాలానికి చెందిన తంగలవాడి నర్సింగ్ 2024 ఫిబ్రవరి 14 న కళ్ళు బట్టి వద్ద జరిగిన గొడవలో జలీల్ ఖాన్ అనే వ్యక్తినీ కర్రతో కొట్టి హతమార్చాడనీ తెలిపారు.
రూరల్ సీఐ సురేష్ కుమార్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టి కోర్టులో అదనపు, జిల్లా మరియు సెషన్ కోర్టులో హాజరు పరచగా నిందితుడికి కఠిన కారాగార శిక్ష , జీవిత ఖైదు, రూ.2000/- జరిమానా విధించినట్లు తెలిపారు.
