బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి నేడు కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆమెను హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మృతిచెందారు.
ఆమె 2005 వరకు శక్కర్ నగర్ లోని బాలికల ఉన్నత పాఠశాలలో హెడ్ మాస్టర్గా విధులు నిర్వహించారు. అంత్య క్రియలు శక్కర్ నగర్ మధ్యాహ్నం జరుగుతాయని పార్టీ వర్గాలు తెలిపాయి.
