HomeCRIMEకొత్వాల్ కొరడా ......మరోసారి ఆపరేషన్ ఛ భూత్ర .........

కొత్వాల్ కొరడా ……మరోసారి ఆపరేషన్ ఛ భూత్ర ………

నిజామాబాద్ పోలీస్ కొత్త కొత్వాల్ హైదారాబాద్ తరహా పోలీసింగ్ మీద దృష్టి పెట్టారు. ఆయన ఎక్కువగా కాలం అక్కడే పనిచేసిన నేపథ్యంలో జిల్లాలో నూ అదే తరహా పోలీసింగ్ వుండేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అర్ధ రాత్రి దాటాక ఎలాంటి కార్యకలాపాలు జరగకుండా కట్టడి చేసే కార్యం మొదలు పెట్టారు.

ఇందులో భాగంగానే ఆపరేషన్ ఛ బుత్రా ను తెరమీదికి తెచ్చారు. నగరంలో రాత్రి వేళలో పరిస్థితులను స్వయంగా చూసారు. రాత్రి పదకొండు గంటల తర్వాత ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు జరగకుండా నియంత్రించాలని ఆదేశాలు జారీచేశారు.

నిర్ణిత సమయంలోగా దుకాణాలు మూసేయించాలని నగర అధికారులకు స్పష్టం చేశారు. కానీ రంజాన్ పండగ ఉండడంతో చూసి చూడనట్లుగా వుంటూ వచ్చారు.కానీ ఇప్పుడు యాక్షన్ లో కి దిగార.

అర్ద రాత్రి దాటాక వ్యాపారాలు నిర్వహిస్తున్న వారి మీద ఎడపెడా కేసులు నమోదు చేసి ఉదయం కోర్టు కు హాజరు పర్చుతున్నారు. కేసు ల నమోదు విషయంలో ఏ మాత్రం అలసత్వం చూపిన సంబంధిత అధికారులకు సంజాయిషీ కోరుతున్నారు.ఆయా ప్రాంతాలో యువకులు అర్ద రాత్రి దాటాక కూడా రోడ్ల మీద విచ్చల విడిగా తిరగడం…

చౌరస్తా ల్లో అద్దాలు వేసి గప్పాలు కొట్టడంచూసి కొత్వాల్ విస్తు బోయారు. అందుకే ఎలాంటి పరిస్థితులను కట్టడి చేయడానికే ఆపరేషన్ ఛ బుత్రా ను తెరమీదికి తెచ్చారు. గతంలో కమిషనర్ గా నెలరోజులే పనిచేసిన సత్యనారాయణ సైతం ఆపరేషన్ ఛ బుత్రా చేపట్టారు.

మరో సారి నగరంలో పోలీసు ఇలాంటి ఆపరేషనే మొదలు పెట్టారు బుధవారం మూడో టౌన్ పోలీసులు చంద్రశేఖర్ x రోడ్ , చంద్రశేఖర్ కాలనీ, గౌతమ్ నగర్ రైతుబజార్ చౌరస్తా ఏరియాలో ఈ ఆపరేషన్ లో చేపట్టి ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా ట్రిపుల్ రైడింగ్, చేస్తున్న 18 వాహనాలు సీజ్ చేసారు.

డ్రంకెన్ డ్రైవింగ్ చేస్తున్న నలుగురి వాహనాలను సీజ్ చేశారు. మైనర్ డ్రైవింగ్ చేసినవారి తల్లిదండ్రులను పిలిచి వారికీ కౌన్సిలింగ్ చేశారు. రాత్రి కి రాత్రే తల్లిదండ్రులను ఠాణా లకు రప్పించారు.

పోలీసు ల ఫోన్ లతో వారు ఒక్కసారి షాక్ అయ్యారు. రాత్రి 10:30 గంటల తర్వాత షాప్ ఓపెన్ చేసిన,అలాగే ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా వెహికల్స్ రోడ్డు పైన తిరిగిన అర్థరాత్రి సమయంలో ఎవరైనా వ్యక్తులు రోడ్ల పైన లేకుంటే గ్రౌండ్లో తిరుగుతూ అడ్డలు వేసిన వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకునేలా నగర పోలీసులకు కమిషనర్ దిశానిర్దేశం చేశారు.

///// ఆపరేషన్ ఛ భూత్ర అంటే ఏమిటి //////////

అర్ద రాత్రి దాటాక కూడా పని పాట లేకుండా రోడ్ల మీద బలాదూర్ గా తిరిగే వారిని నియంత్రించడానికే చేపట్టిన కార్యమే ఆపరేషన్ ఛ భూత్ర ! పోలీసులు భారీ బలగాలతో ఆయా ప్రాంతాలను మూకుమ్మడిగా వెళ్ళి జల్లెడ పడుతాయి.

ఏ కారణం లేకుండా రోడ్ల మీద తిరిగే వారిని చౌరస్తా లో గప్పాలు కొట్టే వారిని ఆరు బయట అడ్డా వేసి ముచ్చట్లు పెట్టె వారిని పోలీసులు అదుపులోకి తీసుకోని అక్కడికే వారి తల్లిదండ్రులం రప్పించి కౌన్సిలింగ్ చేసి రాత పూర్వకంగా హామీ తీసుకోని ఎలాంటి కేసులు లేకుండ వదిలేస్తారు.

పదే పదే అలాగే చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేసి జైల్ కు సైతం పంపుతారు.దీనివల్లరాత్రి పదకొండు దాటాక ఏ కారణం లేకుండా రోడ్ల మీదికి రావాలంటే వెనుకాడుతారు. గతంలో ఓ అధికారి ఎలాంటి ఆపరేషన్ చేస్తే అధికార పార్టీ నేతల ఒత్తిళ్ల తో కమిషనర్ వెనక్కి తగ్గారు.

ఈసారి అయినా ఎలాంటి విఘ్నలు లేకుండా ఛ భుత్ర జరిగితే అర్ద రాత్రి దాక తిరిగే జులాయి లకు చెక్ పెట్టినట్లు అవుతుంది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments