HomeTelanganaNizamabadఎట్టకేలకు దుబాయి నుంచి వచ్చిన బోధన్ మాజీ ఎమ్మెల్యే. ........తల్లి అంతక్రియల కోసం బోధన్ కు......ఎయిర్...

ఎట్టకేలకు దుబాయి నుంచి వచ్చిన బోధన్ మాజీ ఎమ్మెల్యే. ……..తల్లి అంతక్రియల కోసం బోధన్ కు……ఎయిర్ పోర్టు కుతరలి వెళ్లిన గులాబీ నేతలు ……..పాస్ పోర్టు స్వాధీనం చేసుకున్న పోలీసులు …..హైకోర్టు ఆదేశాల మేరకే తదుపరి చర్యలు

పలు కేసుల్లో పరారీ లో ఉన్న బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఎట్టకేలకు ఏడాదిన్నర తరవాత దుబాయి నుంచి ఇండియాకు వచ్చారు.ఆయన గురువారం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా బోధన్ బయలు దేరారు. అక్కడే పోలీసులు అరెస్టు చేస్తారని ప్రచారం జరిగింది.

దీనితో బిఆర్ యస్ నేతలు ఆయన అనుచరులు పెద్దసంఖ్యలో ఎయిర్ పోర్టు తరలివచ్చారు. అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ వచ్చి షకీల్ ను ఓదార్చారు.ఆయన తల్లి గురువారం తెల్లవారు జామున కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆమెను హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.

చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆమె 2005 వరకు శక్కర్ నగర్ లోని బాలికల ఉన్నత పాఠశాలలో హెడ్ మాస్టర్గా విధులు నిర్వహించారు. అంత్య క్రియలు శక్కర్ నగర్ మధ్యాహ్నం జరుగుతాయని పార్టీ వర్గాలు తెలిపాయి.

//పాస్ పోర్టు సీజ్ ….అంతక్రియ ల తర్వాత విచారణకు //

పలు కేసులో షకీల్ ను నిందితుడిగా పేర్కొన్న పోలీసులు గతంలోనే లుక్ ఔట్ నోటీసు లు జారీచేశారు. అందుకే గురువారం ఆయన రాగానే అతని వద్ద ఉన్న పాస్ పోర్టు ను స్వాధీనం చేసుకున్నారు.

బోధన్ లో తల్లి అంతక్రియ ల తర్వాత అదుపు లోకి తీసుకోని విచారించే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మరుసటి రోజే ఆయన దుబాయి వెళ్లిపోయారు. సెంట్రల్ జోన్ పోలీసులు ఆయన మీద పలు కేసులు నమోదు చేసారు. రెండు రోడ్డు ప్రమాదల కేసుల్లో సాక్ష్యాలను చెరిపేశారని అధికారులను బెదిరించారని పేర్కొంటు షీకీల్ మీద కేసులు నమోదు చేశారు.

అలాగే బోధన్ సెగ్మెంట్ లోను కస్టమ్ మిల్లింగ్ బియ్యం దారి మళ్లించారని అభియోగాలు సైతం షకీల్ మీద నమోదు అయ్యాయి. కానీ ఆయా కేసులో షకీల్ హైకోర్టు ను ఆశ్రయించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments