అనుమతి లేని కల్లు దుకాణంపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు.
గురువారం ఎడపల్లి మండలంలోని జానకంపేట లో ఎలాంటి అనుమతి లేకుండా నిర్వహిస్తున్న కల్లు దుకాణం పై సిఐ స్వప్న ఆద్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ కల్లు డిపో లో 350 లీటర్ల కల్లు ధ్వంసం చేశారని తెలిపారు.
అలాగే రసాయన విశ్లేషణ కోసం 2 నమూనాలు తీసుకున్నట్లు తెలిపారు. అక్రమంగా కల్లు డిపో అనుపుతున్న నిర్వాహకుడి పై కేసు నమోదు చేసి,తదుపరి చర్యలు నిమిత్తం బోధన్ పోలీసులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.
