ఇందూర్ నగరం : నాగారం 9వ డివిజన్లో ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ గారు మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ తో కలిసి పర్యటించడం జరిగింది.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మున్సిపల్ కమిషన్ & అధికారులకు పలు సూచనలు చేయడం జరిగింది.
నగరంలో డ్రైనేజీ సమస్య కీలకంగా మారిందని డ్రైనేజీ కాలువలు పూడికలు తీయకపోవడంతో చెత్త, నీరు నిల్వ ఉండటం చూసి మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తం చేసారు.
స్పెషల్ డ్రైవ్ నిర్వహించి డివిజన్ లో డ్రైనేజీ కాలువలు పూడికలు తీయాలని,నిత్యం డ్రైనేజీ పూడికలు తీసే విదంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
డ్రైనేజీ కొత్త కాలువలు & సీసీ బీటీ రోడ్లు అవసరం ఉన్న చోట నిర్మించాలని ముఖ్యంగా రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కమిషనర్ గారికి సూచించారు.
వేసవి కాలంలో ప్రజలకు మంచినీటి కోరత లేకుండా చూసుకోవాలని అన్నారు అవసరం ఉన్న చోట వాటర్ ట్యాంక్ లు, బోర్స్ వేయాలని సూచించారు.
ధన్ పాల్ లక్ష్మిభాయ్ & విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ధ్వరా డివిజన్ ప్రజలకు మంచినీటి సౌకర్యం కోసం తన సొంత నిధులతో వేపించిన మంచి నీటి బోర్స్ ను మున్సిపల్ అధికారులను స్వాధీనం చేస్తూ వాటికీ మీటర్స్ ఏర్పాటు చేయాలనీ సూచించారు.
డివిజన్ విస్తరిస్తున్న కారణంగా ఎలక్ట్రికల్ స్తంబాలు, వీది ద్విపాల కోరత ఏర్పడుతుందని దీనికి పరిష్కారంగా స్తంబాలు, వీధి లైట్లు ఏర్పాటు చేయాలనీ సూచించారు
డివిజన్ వాసులకు ఆహ్లాదకరమైన పార్క్, ఓపెన్ జీమ్ తో కూడిన నిర్మాణం చేపట్టాలని సూచించడం జరిగింది.
ఇందూర్ అర్బన్ నియోజకవర్గం పరిధిలో ఉన్న అన్ని డివిజన్లో సమస్యలను పరిశీలించడం జరుగుతుందని వాటిని త్వరలో పరిష్కరించేల అధికారులతో కలిసి చర్యలు తీసుకుంటాం అని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ EE మురళి మోహన్ రెడ్డి, అడిషనల్ మున్సిపల్ కమీషనర్ జయకుమార్,AE భూమేష్, బిజెపి మండల అధ్యక్షులు నాగరాజు,స్థానిక మాజీ కార్పొరేషన్ సాయి వర్ధన్, కిరణ్, సుందర్ రాథోడ్, సాయి తదితరులు పాల్గొన్నారు.
