HomeLaw and Orderఅగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి..అగ్ని

అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి..అగ్ని

ప్రమాదాలు సంభవించినప్పుడు అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక శాఖ అధికారి నర్సింగ్ రావు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్, మార్ట్ లో ఫైర్ ఆక్సిడెంట్ జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మాల్ నిర్వహించి, అవగాహన కల్పించారు.

ప్రమాదం జరిగినప్పుడు కంగారు పడకుండా విద్యుత్ సరఫరా నిలిపి వేసి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. మంటలకు మరింత తోడునందించే పదార్థాలు ఏమైనా ఉంటే వెంటనే వాటిని దూరంగా పడేయాలని అన్నారు. విద్యుత్ సరఫరా సమయంలో అగ్ని ప్రమాదం జరిగితే కర్ర సాయంతో తొలగించాలన్నారు.

కరెంట్ సరఫరా ఉన్న వస్తువులపై వెంటనే నీరు పోయొద్దని తెలిపారు. అగ్నిప్రమాదం జరిగితే 101 నంబర్ కు సమాచారం ఇవ్వాలన్నారు.

అగ్ని మాపక వారోత్సవాల సందర్భంగా జన సమూహాలు ఉన్న ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వివరించారు.ఈ కార్యక్రమంలో అగ్ని మాపకశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments