శుభాష్ నగర్ లోని తెలంగాణ ఆల్ పెన్సనర్స్ & రిటైర్ట్ పర్సన్స్ అసోసియేషన్ వారి నూతన భవనం ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ గారు పాల్గొనడం జరిగింది.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతు కేంద్ర, రాష్ట్ర శాఖలలో పని చేసి పదవి విరమణ పొందిన సీనియర్ సిటిజన్స్ అందరు వారి అనుభవాన్ని సమాజ శ్రేయస్సుకు ఉపయోగించాలని అన్నారు.
విశ్రాంత ఉద్యోగులు గుర్నాల సరోజినమ్మ గారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు వారు చేస్తున్న సేవ కార్యక్రమాలను కొనియాడారు.
రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల బినిఫిట్స్ ఇతర సమస్యలను అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని అలాగే విశ్రాంత ఉద్యోగుల ఆరోగ్య సంక్షేమం కొరకు యోగ కేంద్రం, లైబ్రరీ ఏర్పాటుకు ప్రభుత్వ నిధులు సమాకూర్చేల కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
నూతనంగా ఏర్పాటు చేసిన సంఘం భవనం ఉపయోగనికి ధన్ పాల్ లక్ష్మి & భాయ్ విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ధ్వరా వంద కుర్చీలు అందచేశారు.
ఈ సందర్బంగా వివిధ రంగాలలో సేవలు అందిస్తున్న ప్రముఖులను ఎమ్మెల్యే గారు సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్, శ్రీ దశరథ్ గారు డిప్యూటీ డైరెక్టర్ ట్రెజరరీ శాఖ,శ్రీమతి. రసూల్ భీ గారు మహిళా & శిశు సంక్షేమ, వయో వృద్ధుల శాఖ జిల్లా అధికారిణి, శ్రీ పి. కృష్ణా మూర్తి గారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆల్ పెన్స్ నర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
