వడ్డి దందా ఫైపోలీసులు మరోసారి పంజా విసిరారు. ఆయా ప్రాంతాల్లో బడా వ్యాపారుల మీద విరుచుకుపడ్డ.
గురువారం తెల్లవారు జామున నిజామాబాదు పోలీస్ కమీషనరేట్ పరిధిలోని నిజామాబాదు, ఆర్మూర్, బోధన్ లో వడ్డీ వ్యాపారుల ఇండ్లలో మూకుమ్మడి గా దాడులు చేసారు దాదాపు 20 బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి
అధిక వడ్డీ వసూలు చేస్తు ప్రజలను ఇబ్బంది పెడుతున్న వారిపై పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు దాడులు నిర్వహించారు .
తెల్లవారుజామున మొదలైన సోదాలు ఉదయం తొమ్మది గంటల దాక సాగాయి. ఆయా ప్రాంతాల్లో వడ్డి దందా పేరుతొ పేద మధ్య తరగతి ప్రజలను రాబందుల్లా పీక్కుతింటున్న వడ్డి రాయుళ్ల చిట్టా ను ఇదివరకే సిద్ధం చేసుకున్నారు. ఇదివరకు సీపీ గా ఉన్న కల్మేశ్వర్ హయాంలో నే ఆయా ప్రాంతాల్లో వడ్డి రాయుళ్ల ను గుర్తించారు.
ఇదే తరహాలో మెరుపు దాడులు చేసి వారి నుంచి కీలక డ్యాకుమెంట్ లు పోస్టు డేట్ చెక్ లు ప్రామిసరీ నోట్ లతో పాటు నగదు లు స్వాధీనం చేసుకున్నారు కానీ తదుపరి దర్యాప్తు ను అప్పటి సీపీ సీరియస్ గా పట్టించుకోలేదు. దీనితో స్థానిక అధికారులు భారీగా వసూళ్ల దందా కు తెరలేపారు.
వడ్డి వ్యాపారులను పీడించారు. గతంలో టాస్క్ ఫోర్స్ లో కీలకంగా పనిచేసిన ఓ అధికారి స్పెషల్ బ్రాంచ్ లో పనిచేసే అధికారి తో కలిసి వడ్డి వ్యాపారులతో ఆర్థిక లావాదేవీలు జరిపారు. ఇవన్నీ తెల్సి కూడా కొత్వాల్ కొరఢా ఝుళిపించలేక పోయారు. దీనితో జిల్లాలో వడ్డి దందా యదావిధిగా సాగింది. మూడు నుంచి పది రూపాయలు వడ్డి వసూలు చేసే వారు వందల్లో ఉన్నారు.
సమగ్ర దర్యాప్తు జరపక పోవడంతో ఈ దందా లో సాగుతున్న అసలు గుట్టు రట్టు కాలేదు. ఎందుకంటే వడ్డి దందా లో డాన్ లుగా ముద్ర ఉన్నవారంతా ప్రభుత్వ టీచర్లు రెవెన్యూ పోలీస్ అధికారులే ఎక్కువగా ఉన్నారు.
శివాజి నగర్ కు చెందిన ఓ టీచర్ అయిదు నుంచి ఆరు కోట్ల రూపాయలు వడ్డి దందా లో టర్నవోర్ చేస్తున్నారు. గంజ్ లో కోటి నుంచి అయిదు కోట్ల దాక వడ్డి కి ఇచ్చే వారు అరడజన్ మంది ఉన్నారు. వీరి దందా లో అనేక మంది బినామీ లున్నారు.కానీ పోలీసు దాడుల సెగ వీరెవ్వరికి తగల లేదు. కాసుల మాయ తో దర్యాప్తు దారి తప్పింది.
దాదాపు ఏడాది కాలం తరవాత పోలీసులు మరోసారి ఈ దందా ఫై కొరడా ఝుళిపించారు. కానీ ఈసారి మరిన్ని ఎక్కువ బృందాలు రంగంలోకి దిగాయి.గురువారం తెల్లవారు జామునే వడ్డి రాయుళ్ల ఇండ్ల మీది విరుచుక పడ్డాయి.
ఈసారైనా తదుపరి సమగ్ర దర్యాప్తు చేస్తే బినామీ లాగుట్టు వెలుగు లోకి వచ్చే ఛాన్స్ ఉంది. తదుపరి దర్యాప్తు లో కఠిన కార్యాచరణ వుంటే కొంత మేరకైనా వడ్డి పీడ తగ్గే అవకాశం ఉంది.
