HomeCRIMEఅగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి..

అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి..

ఇండస్ట్రీలో కార్మికులకు అవగాహన ఇండస్ట్రీలలో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని కార్మికులకు అగ్నిమాపక శాఖ అధికారి నర్సింగ్ రావు అవగాహన కల్పించారు.

శుక్రవారం నగర శివారులోని ఆర్కే ఇండస్ట్రీస్ లో ఫైర్ ఆక్సిడెంట్ జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

ప్రమాదం జరిగినప్పుడు కంగారు పడకుండా విద్యుత్ సరఫరా నిలిపి వేసి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. మంటలకు మరింత తోడునందించే పదార్థాలు ఏమైనా ఉంటే వెంటనే వాటిని దూరంగా పడేయాలని అన్నారు.

విద్యుత్ సరఫరా సమయంలో అగ్ని ప్రమాదం జరిగితే కర్ర సాయంతో తొలగించాలన్నారు. కరెంట్ సరఫరా ఉన్న వస్తువులపై వెంటనే నీరు పోయొద్దని తెలిపారు. అగ్నిప్రమాదం జరిగితే 101 నంబర్ కు సమాచారం ఇవ్వాలన్నారు.

ఈ కార్యక్రమంలో అగ్ని మాపకశాఖ సిబ్బంది సుమన్,కిరణ్ కుమార్, ప్రశాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments