సాధింపు చర్యలలో భాగంగానే అక్రమంగా సోనియా రాహుల్ గాంధీ పై ఈ.డి తో చార్జిషీట్ లో అక్రమంగా వారి పేర్లను చేర్చారని యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు విపుల్ గౌడ్ మండిపడ్డారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ లపై తప్పుడు కేసులకు నిరసనగా హైదరాబాదులోని ఈ.డీ కార్యాలయ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్న నిజామాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్ జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులను హైదరాబాద్ లో అరెస్ట్ చేసి అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు .
దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారికి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక ఈడీ తో వేదిస్తుందన్నారు దేశ ప్రజల మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన అన్నారు.కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి అంజిని గౌడ్ , జిల్లా ఉపాధ్యక్షులు అనుపాల్ కిరణ్ ,బాల్కొండ నియోజకవర్గ అధ్యక్షులు చరణ్ ,నార్త్ మండల్ అధ్యక్షులు దినేష్ , ఉపాధ్యక్షులు గడ్కోల్ సంతోష్ , మాక్లూర్ మండల్ అధ్యక్షులు వినోద్ పాల్గొన్నారు .
