HomeTelanganaNizamabadప్రజా సమస్యల పరిష్కారం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం విడనాడాలి. సిపిఎం జిల్లా...

ప్రజా సమస్యల పరిష్కారం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం విడనాడాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్.

ప్రజా సమస్యలు పరిష్కరించాలని సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు . ఈ సందర్భంగా సమస్యలు పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరిగింది.

అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ కేంద్ర .రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలకు పరిష్కారం పట్ల చిత్తశుద్ధి లేకపోవడంతో సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉన్నాయని ఆయన విమర్శించారు.

ప్రధానంగా గత దశాబ్ద కాలం పాటు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం. రాష్ట్రంలోని బిఆర్ ఎస్ ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించేస్తామని హామీ ఇచ్చి విస్మరించాయని.

ఉపాధి అవకాశాలు పెంచకపోవటంతో నిరుద్యోగం విస్తరించిందని గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించారని ఆయన విమర్శించారు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కారం కొరకు తాము కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చి.

అధికారంలోకి వచ్చే సంవత్సరంనరవుతున్న అప్పటికే కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ చేయలేదని, అందరికీ రుణమాఫీ కాలేదని, మహిళలకు నెలకు ఇస్తామన్నా 2500 రూపాయల మాట మర్చిపోయారని కౌలు రైతులకు, నిరుద్యోగులకు ఇస్తామన్న భృతి అమలు కావటం లేదని.

పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోగా ప్రభుత్వ భూములు కొన్ని నివసిస్తున్న వారికి పట్టాలు కూడా ఇవ్వటం లేదని హాయ్ న విమర్శించారు. జిల్లాలో అనేక గ్రామాల్లో, పట్టణాల్లో శివారు ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి పెరిగిందని, సరైన రోడ్లు మురికి కాలువలు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని, విద్యుత్తు సౌకర్యం అస్తవ్యస్తంగా ఉందని జిల్లాలో ప్రధానంగా చట్ట వ్యతిరేకంగా ఏర్పడ్డ గ్రామ అభివృద్ధి కమిటీలు బడుగు బలహీన వర్గాల ప్రజల పట్ల చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ సంఘ బహిష్కరణలను, జరిమానాలను, పన్నులను విధిస్తూ ప్రజలను పీడిస్తున్నారని

వాటిని ప్రభుత్వం నిషేధించి చట్టపర చర్యలు తీసుకోకుండా రాజీ ధోరణితో వ్యవహరించటం మూలంగా వారి ఆగడాలు పెరుగుతున్నాయని ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే గ్రామ అభివృద్ధి కమిటీలను నిషేధించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు. నూర్జహాన్, శంకర్ గౌడ్, వెంకటేష్, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, కొండగంగాధర్, నన్నే సాబ్ తదితరులతోపాటు నాయకులు నాయక్ వాడి శ్రీనివాస్, కటారి రాములు, సాయిలు, దినేష్, రాజు, అనసూయమ్మ, నల్వాల నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments