రైతు మహాత్సవం కు హైదారాబాద్ నుంచి హెలి క్యాపిటర్ లాండింగ్ లో సమన్వయ లోపం తలెత్తింది. హెలి ప్యాడ్ వద్ద ఛాపర్ దిగే సమయంలో వచ్చిన గాలి తో వేదిక స్వాగత తోరణం కూలిపోయింది.
గిరిరాజ్ కాలేజీ మైదానం వేదిక సమీపంలోనే హెలి ప్యాడ్ ఏర్పాటు చేశారు. మంత్రులకు స్వాగతం చెప్పడానికి ఆయా శాఖల అధికారులతో పాటు అధికార పార్టీ ముఖ్య నేతలు భారీ సంఖ్యలో వచ్చారు. యంత్రాంగం సైతం రైతు మహాత్సవం ఏర్పాట్లు ను ఘనంగా చేసింది.
అధునాత టెంట్లు ఆకర్షణీయంగా స్వాగతం తోరణం ఏర్పాటు చేసింది. కానీ ఆ పక్కనే హెలిప్యాడ్ ఉండడంతో ఛాపర్ దిగే వచ్చిన గాలి తో స్వాగతం తోరణం కూలిపోయింది. వేదిక మొత్తం దుమ్ము తో కమ్ముక పోయింది.
వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన కోసం వేసిన గుడారాల్లో ను దుమ్ము పేరుక పోయింది. కొద్దీ దూరంలోనే కొత్త కలెక్టరేట్ లో హెలి ప్యాడ్ ఉన్నప్పటికి గిరిరాజ్ కాలేజీ మైదనం లోనే అదికూడా వేదిక పక్కనే హెలి ప్యాడ్ ఏర్పాటు చేయడం వల్లే ఎలా జరిగింది.
