గులాబీ శ్రేణుల్లో రజతోత్సవ జోష్ మొదలయ్యింది. ఏడాది న్నర కాలంగా స్తబ్దంగా ఉన్న శ్రేణుల్లో వరగంల్ సభ సన్నద్ధత కనిపిస్తుంది. పదేళ్ల అధికారం దర్పం వీడి ఇప్పుడిప్పడే ప్రజాక్షేత్రంలో కి వస్తున్న పార్టీ వరంగల్ సభ తో గత వైభవం ను సంతరించుకొ వాలని తపిస్తుంది.
ఇప్పుడున్న ప్రతికూల పరిస్థితుల్లో రజతోత్సవ సభ క్యాడర్ లో సమరోత్సవం నింపడం ఖాయమనే అంచనాలో పార్టీ పెద్దలున్నారు అందుకే వరంగల్ సభ సూపర్ హిట్ కోసం సర్వశక్తులే ఒడ్డుతున్నారు.ఈ సభ లక్షలాది గా ప్రజలను తరలించే వ్యూహరచన చేస్తుంది.
ఈ మేరకు పార్టీ ముఖ్య నేతలను క్షేత్ర స్థాయిలో మోహరింప జేశారు. ఈసారి అధినేత కెసిఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. మొదట కవిత ఈ సభ కోసం పనిచేస్తారని భావించారు కానీ ఆమె బాన్స్ వాడ వ్యవహారాలకే పరిమితం అయ్యారు ఆయా సెగ్మెంట్ లలో మాజీ ఎమ్మెల్యే లు పార్టీ ముఖ్య నేతలతో విరివిరిగా మాట్లాడుతున్నారు.
సాధారణ ప్రజానీకం సంగతి ఎలా ఉన్నా పార్టీ శ్రేణుల్లో మాత్రం ఉత్సహం ఉరకలేస్తుంది.తీవ్రమైన ఎండలు జనసమీకరణ ఫై తీవ్ర ప్రభావం చూపే అవకాశం వుందని మాజీ ల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. వరంగల్ సభకు ప్రజలను తరలించడం కష్టంగా మారబోతుంది.ఓ వైపు తీవ్రమైన ఎండలు మరో వైపు యాసంగి ధాన్యం కొనుగోళ్ల పక్రియ సాగుతుంది.
ఇలాంటి ప్రతికూల పరిస్థితులను అధిగమించి ప్రజలను వరంగల్ సభ తరలించడం దుసాధ్యంగా భావిస్తున్నారు . దూరాభారం తో నిజామాబాద్ జిల్లా కు జనసమీకరణ టార్గెట్ తక్కువగానే ఇచ్చారు అయినప్పటికి ఇచ్చిన టార్గెట్ మేరకు జనసమీకరణ కోసం నేతలు ఆపసోపాలు పడుతున్నారు. యాడాదిన్నర తరవాత మాజీ లు వరంగల్ సభ కోసం యాక్టివ్ అయ్యారు ..
ప్రభుత్వ వైఫల్యాలు క్షేత్ర స్థాయిలో పార్టీ కి సానుకులంగా మారాయి . అందుకే ఈ సభ తర్వాత అధినేత కెసిఆర్ సైతం మరోసారి ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టేలా కార్యాచరణ సిద్ధం అవుతుంది. . ఈపాటికే జిల్లాల వారీగా నేతలతో కెసిఆర్ భేటీ అయ్యారు.
జనసమీకణ ఎలా చెయ్యాలి ఏ జిల్లా నుంచి ఎంత మంది ని తరలించాలనేది దిశానిర్దేశం చేసారు. ఈ భేటీ తర్వాత నియోజకవర్గ ఇంచార్జి లుగా చెలామణి అవుతున్న మాజీ ఎమ్మెల్యే లు హైదారాబాద్ ను వదిలి నియోజకవర్గాలకు ఎంట్రీ ఇస్తున్నారు మరోసారి క్యాడర్ ను లీడర్లను చేరదీస్తున్నారు.
పార్టీ ఆదేశాల మేరకు వరంగల్ సభ కోసం నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు మొదలు పెట్టారు.ఇందుకోసం ఎమ్మెల్సీ కవిత సైతం రంగంలోకి దిగారు మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి తో కలసి బాన్స్ వాడ సెగ్మెంట్ లో క్యాడర్ ను గట్టిగా కదిలించే పనిలో ఉన్నారు.
జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి ఎట్టకేలకు ఆర్మూర్ లో మకాం వేశారు నియోజకవర్గ సన్నాహక సమావేశం సక్సెస్ చేశారు. ఆయన ఈ భేటీ లో క్యాడర్ లో ఉత్తేజం కలిగేలా బీజేపీ కాంగ్రెస్ నేతల మీద తీవ్ర స్థాయిలో చెలరేగారు. మునుపటి దూకుడు తో సహజంగానే క్యాడర్ ఉత్సహం ఉరకలేసింది.
ఇప్పటికే అధికార పార్టీ తనను టార్గెట్ చేసినా సరే జీవన్ రెడ్డి తగ్గేదే లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మరో వైపు ఎమ్మెల్యే గా గెలిచిన సైలెంట్ గా వుంటూ వస్తున్న మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి సైతం వరంగల్ సభ కు ప్రజలను తరలించే కార్యం లో ఉన్నారు.
వ్యవసాయ క్షేత్రానికి పరిమితం అయిన మరో సీనియర్ నేత బాజిరెడ్డి కూడా రంగంలోకి దిగారు తాను ప్రాతినిధ్యం వహించిన నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ తో పాటు అధినేత ఆదేశాల మేరకు బాన్స్ వాడ మీద సైతం ఓ కన్నేశారు. అలాగే బలమైన మైనార్టీ నేత మాజీ ఎమ్మెల్యే షకీల్ తల్లీ మృతి బాధ లో ఉన్నారు అయినప్పటికి ఆయన వరంగల్ సభ కోసం సన్నాహాలు మొదలు పెట్టారు దాదాపు ఏడాదిన్నర తర్వాత బోధన్ లో అడుగు పెట్టిన షకీల్ అధికార పార్టీ నుంచి తలెత్తే ఇబ్బందులను సైతం న్యాయ పరంగానే ఎదుర్కునే ఆలోచనలో ఉన్నారు.
ఇక నుంచి పూర్తీ స్థాయిలో పార్టీ కార్యకలాపాల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ ఓ అడుగు ముందుకేసి ఏకంగా చేరికల కే తెర తీశారు. ఆయన కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నిరాశ చెందారు. పూర్తీ గా హైదారాబాద్ కు పరిమితం అయ్యారు.
కానీ వరంగల్ సభ కోసం భారీఎత్తున క్యాడర్ ను సమీకరించే పనిలో నిమగ్నం అయ్యారు.మొత్తంగా బిఆర్ యస్ వజ్రోత్సవాలు నేపథ్యంలో పార్టీ యంత్రాంగం మరోసారి యాక్టివ్ అయింది. హైదారాబాద్ కు పరిమితం అయినా మాజీ ఎమ్మెల్యే లు సైతం నియోజకవర్గాల దారి పట్టారు.
