HomePOLITICAL NEWSUncategorizedకర్రీ గుట్టల్లో ఏకధాటిగా కాల్పులు ......38 మంది మావోయిస్టుల హతం ??

కర్రీ గుట్టల్లో ఏకధాటిగా కాల్పులు ……38 మంది మావోయిస్టుల హతం ??

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని బీజాపూర్ జిల్లా ధర్మ తాళ్లగూడెం కర్రిగుట్టల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగి నట్లుగా సమాచారం అందుతుంది.దాదాపు 38 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా అనుమానిస్తున్నారు.

ఆపరేషన్ కాగర్ పేరుతొ కేంద్ర బలగాలతో పాటు రెండు రాష్ట్రాల పోలీసులు కలిసి కట్టుగా కర్రీ గుట్ట లో మొదలు పెట్టిన గాలింపు చర్యలు తీవ్ర ఉత్కంఠ రేపాయి.

మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ నేతలతో పాటు సాయుధ విభాగమైన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి చెందిన వేయ్యి మందికిపైగా సభ్యులు సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఈ జాయింట్ ఆపరేషన్ మొదలుపెట్టారు .

గత వారం రోజులుగా కర్రిగుట్ట ను టార్గెట్‌గా చేసుకుని దాదాపు 5,500 మందితో డీఆర్‌జీ బస్తర్ ఫైటర్ కోబ్రా సీఆర్‌పీఎఫ్ ఎస్టీఎఫ్ బలగాలు భారీ కూంబింగ్ ఆపరేషన్‌‌ చేపట్టాయి .

ముఖ్యంగా హెలికాప్టర్లు, అత్యాధునిక టెక్నాలజీ కలిగిన డ్రోన్లతో అడవి ప్రాంతాన్ని నాలుగు వైపుల చుట్టుముట్టాయి. దీనితో తమతో శాంతి చర్చలు జరపాలని ఆ పార్టీ లేఖ లో కోరింది ప్రజా సంఘాలు సైతం ఆ దిశ గా కొంత మేరకు ప్రయత్నాలు చేసాయి.

కానీ చర్చలను కేంద్రం తోసి పుచ్చింది. ఈ క్రమంలోనే శనివారం జరగిన ఎదురు‌కాల్పుల్లో సుమారు 38 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. మృతుల సంఖ్య కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది.

మరో వైపు అగ్ర నేతలు దాదాపు అరడజన్ మంది కర్రీగుట్ట ను ధాటి భద్రాచలం వైవు వెళ్లి నట్లుగా వచ్చిన సమాచారం మేరకు బలగాలు ఆ వైపు కూడా చుట్టుముట్టాయి .అయితే కాల్పుల్లో ఎంత మంది చనిపోయారనే విషయం ఇరువర్గాల నుంచి ధ్రువీకరణ జరగలేదు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments