HomeTelanganaNizamabadచరిత్రలో నిలిచిపోయేలా బీఆర్‌ఎస్‌ రజతోత్సవ మహాసభ..నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా

చరిత్రలో నిలిచిపోయేలా బీఆర్‌ఎస్‌ రజతోత్సవ మహాసభ..నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా

చరిత్రలో నిలిచిపోయేలా బీఆర్‌ఎస్‌ రజతోత్సవ మహాసభ..చరిత్రలో నిలిచిపోయేలా ఈ బిఆర్ఎస్ రజోత్సవ మహాసభ ను నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తెలిపారు.

శనివారం జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆదివారం వరంగల్ ఎల్కతుర్తిలో జరిగే ఈ సభ చరిత్రలో నిలిచిపోతుందనీ ఆయన అన్నారు. మొన్నటి వరకు జరిగిన మహాకుంభమేళ మాదిరిగా ఈ వరంగల్ రజతోత్సవ సభ కోసం తెలంగాణ ప్రజలు వేచి చూస్తున్నారని తెలిపారు.

అలాగే రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఈ రజతోత్సవ సభ కోసమే చర్చిస్తున్నారని తెలిపారు.ఇక తెలంగాణ నూతన రాష్ట్ర ఏర్పడిన నాటినుంచి పదేండ్లపాటు దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిపిన బీఆర్‌ఎస్‌ సుపరిపాలన మేళవింపుగా ఈ రజతోత్సవ మహాసభ ఉండనున్నదని తెలిపారు.

నేడు అధికారులలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఉందో కానీ ప్రతి గ్రామంలో కేసీఆర్ పేరే వినిపిస్తుందని గుర్తు చేశారు.రైతుల కోసం రైతుబంధు, రైతు బరోసా ద్వారా అండగా నిలిచారని పేర్కొన్నారు. కెసిఆర్ ప్రభుత్వం హయంలో ప్రతి ఒక్కరికీ ఏ ఒక్క పథకం కూడా ఆగకుండా అమలు చేశారని తెలిపారు.

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ నినాదమైన ప్రత్యేక రాష్ట్ర సాధనను ప్రపంచ నలుమూలల చాటిచెప్పి దేశ పాలకులను మెప్పించి ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్ పార్టీ రజిత ఉత్సవ పండుగకు ప్రజలు ఉవ్వెత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ జాతిపిత కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు. ఆదివారం ఉదయం 10 గంటలకు బైపాస్ రోడ్డు వద్ద కృష్ణ హోటల్ నుంచి ఈ సభకు బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే డివిజన్ల వారిగా కోఆర్డినేటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

సభకు వచ్చే ప్రజలకు,పార్టీ నాయకులకు,శ్రేణులకు తాగునీటిని, ఆహార వసతిని సమకూర్చామని,ఎలాంటి ఇబ్బందులు తేలెత్తకుండా చూస్తామని తెలిపారు.ప్రతి ఒక్కరూ తమ డివిజన్ లో పార్టీ జెండా ఆవిష్కరించి సభకు తండోపతండాలుగా తరలి రావాలని కోరారు.

బీఆర్ఎస్ పార్టీ 25వ వసంతంలో అడుగుపేడుతున్న సందర్భంగా ఈ నెల 27 న వరంగల్ ఎల్కతుర్తిలో రజతోత్సవ సభ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ దాదన్న విఠల్ రావు,మాజీ మేయర్ నీతూ కిరణ్, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments