Sunday, April 19, 2026
HomeTelanganaNizamabadమహాత్మా బసవేశ్వర జయంతిని ఘనంగా నిర్వహించిన BRS నేత దాదన్న విఠల్ రావు – చిత్రపటానికి...

మహాత్మా బసవేశ్వర జయంతిని ఘనంగా నిర్వహించిన BRS నేత దాదన్న విఠల్ రావు – చిత్రపటానికి నివాళులు, బసవన్న సేవలపై నివేదిక

లింగాయత్ సంప్రదాయ వ్యవస్థాపకుడైన బసవన్న పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని దాదన్న గారి విఠల్ రావు BRS పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ జడ్పీ చైర్మన్ ఆధ్వర్యంలో …BRS పార్టీ జిల్లా కార్యాలయం, ఎల్లమ్మగుట్టలో నేడు బసవేశ్వర చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దాదన్న గారి విఠల్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత హైదరాబాదు హుస్సేన్ సాగర్ వద్దగల ట్యాంక్ బండ్ పై మహాత్మా బసవేశ్వర విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతోపాటు రవీంద్రభారతిలోనూ తెలంగాణలోని అన్ని జిల్లాలలో అధికారికంగా బసవేశ్వర జయంతి ఉత్సవాలను నిర్వహించింది.

వీరశైవ లింగాయత్‌ ఆత్మగౌరవ భవన నిర్మాణంకోసం తెలంగాణ ప్రభుత్వం రూ.10 కోట్ల విలువైన ఎకరం స్థలాన్ని కేటాయించి అంటూ ఆయన సేవలను ఆశయాలను కొనియాడారు.

ఈ కార్యక్రమంలో… BRS పార్టీ జిల్లా నాయకులు తెలంగాణ శంకర్, కరిపె రాజు, శేఖర్ రాజు, అంబటి శ్రీనివాస్ గౌడ్, ఫయీమ్ ఖురేషి, మీసాల శంకర్, హర్షవర్ధన్ రావు, విజయ్ కుమార్, కాలి చరణ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!