పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీ కొని మహిళ మృతి చెందినట్లు రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి తెలిపారు. ఈ ఘటన డిచ్ పల్లి పరిధిలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్లితే..డిచ్ పల్లి మండలం దుస్గమ్ కు చెందిన రాయ సాయవ్వ(65). పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీ కొనగా అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.
నిజామాబాద్ రైల్వే స్టేషన్ మేనేజర్ చందన్ కుమార్ సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
