భారతీయ జనతాపార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి ఆధ్వర్యంలో నిఖిల్ సాయి చౌరస్తా లో నిర్వహించిన ప్రధానమంత్రి మోదీ చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఇందూర్ *అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ గారు* పాల్గొనడం జరిగింది.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు ప్రధానమంత్రి నరేంద్రమోది చిత్రపటానికి, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి చిత్రపటానికి, ఎంపీ అరవింద్ చిత్రపటానికి పాలాభిషేకం చేసారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతు భారతదేశ జనగననతో పాటు కులగనన చేయాలనీ ఒక చరిత్రత్మక నిర్ణయాన్ని కేంద్ర మంత్రి మండలి తీసుకోవడం దేశ ప్రజలందరు హర్షించదగ్గ విషయం అన్నారు.కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జనగనన & కులగనన ఆధారంగా దేశంలో అన్ని వర్గాల ప్రజలకు లబ్ది చేకూరుతుందని తెలియజేసారు.
దేశ భద్రత విషయంలో ఈ దేశ పౌరులు ఎంతమంది, ప్రక్క దేశాలైన పాకిస్తాన్, బాంగ్లాదేశ్ వివిధ దేశాల నుండి వచ్చిన అక్రమ చొరబాటుదార్లు, రోహింగ్యలు ఎవరనేది పూర్తి లెక్కలు తెలుతాయి అని అన్నారు.
కేంద్ర మంత్రిమండలి తీసుకున్న నిర్ణయానికి దేశ ప్రజలు, మేధావులు అందరు హర్షం వ్యక్తం చేస్తుంటే కాంగ్రెస్ మాత్రం ఈ విజయం మాదే అంటు గొప్పలు చెప్పుకునే సిగ్గు మాలిన పని చేస్తుంది అన్నారు.దేశాన్ని 60 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించిన సమయంలో ఎందుకు దేశమంతట కులగనన నిర్వహించలేదని ప్రశ్నించారు
దీనికి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు.తెలంగాణలో నిర్వహించిన కులగనన ఒక తప్పుల తడక అని అన్నారు ఒక సామజిక వర్గాన్ని సంతృప్తి పరిచి బీసీలకు అన్యాయం చేసారన్నారు, తెలంగాణాలో నిర్వహించిన కులగనన చెత్త బుట్టలో వేయడానికే ఉపయోగ పడుతుందని, కాంగ్రెస్ నాయకులే దాన్ని తగలపెట్టిన విషయాన్నీ గుర్తు చేసారు.
దేశవ్యాప్తంగా కేంద్రం నిర్వహించే జనగనన & కులగనన పరదర్శకంగా ఉంటుందని దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడేల అందరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేల, అందరికి సమాన హక్కులు, రిజర్వేషన్స్ అందించడానికి ఇది ఒక మైలు రాయిల ఉపయోగపడుతుందని ధీమా వ్యక్తం చేసారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు,కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
