జిల్లా రాజకీయాలు యాసంగిధాన్యం చుట్టే తిరుగుతున్నాయి. కొనుగోలు కేంద్రాలు రాజకీయ రచ్చకు అడ్డాగా మారాయి. జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల లో రైతులు అనేక ప్రాంతాల్లో రోడ్డెక్కుతున్నారు. ఇప్పుడు బీజేపీ బిఆర్ యస్ పార్టీలు సైతం రంగంలోకి దిగాయి.
బీజేపీ ఎమ్మెల్యే తో పాటు బిఆర్ యస్ మాజీ ఎమ్మెల్యే లు స్వయంగా ఆయా ప్రాంతాల్లో అర బెట్టిన రైతులను కలిసి మాట్లాడారు.ధాన్యం ఎందుకు కొనుగోలు చేయడం లేదంటూ అధికారుల మీద ఫైర్ అయ్యారు.
ఇచ్చిన మాట మేరకు కొనుగోలు చెయ్యక పొతే ధాన్యం తో కలెక్టరేట్ ముట్టడిస్తామంటూ బిఆర్ యస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి అల్టిమేటం కూడా ఇచ్చారు. మరో వైపు అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ కొత్త గంజ్ లో ధాన్యం కుప్పలను చూసి విస్తుబోయారు.
తన నియోజకవర్గ పరిధి రైతుల కాక పోయిన సరే ఆయన ధాన్యం కుప్పల వద్ద రైతుల దుస్థితి చూసి చలించి పోయారు. అక్కడి రైతులతో మాట్లాడి సాధక బాధలు విన్నారు. ఆ రైతులు తన నియోజకవర్గ పరిది కాక పోయిన వెంటనే అధికారులను గట్టిగా క్లాస్ పీకారు ప్రభుత్వం ధాన్యం వెంటనే కొనేస్తున్నాం అంటూ చెప్తుంటే ఇక్కడ రోజుల తరబడి ఎందుకు జాప్యం జరుగుతుందని గట్టిగా అరుసు కున్నాడు.
ఓ వైపు బిఆర్ యస్ మరో వైవు బీజేపీ లు ధాన్యం కొనుగోళ్ల లో జాప్యం ను ఫోకస్ చేస్తుంటే అధికార పార్టీ నుంచి ఎలాంటి కౌంటర్ లేదు. రైతు తాలూకు నామినేటెడ్ పోస్టు ల్లో ఉన్న నేతలు జిల్లాలో నాలుగురున్నారు ఇద్దరు ఎమ్మెల్యే లున్నారు అయినా జిల్లాలో కొనుగోళ్లు ఎలా జరుగుతున్నాయో తెలుసు కొని గట్టిగా కౌంటర్ ఇచ్చే సోయి ఏ ఒక్కరికి లేదనే ఆవేదన అధికార పార్టీ క్యాడర్ లో ఉంది.
నిజానికి ఈసారి యాసంగి సాగు లో జిల్లా రైతులు అనేక ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నారు.తీరా పంటలు చేతికొచ్చాక ,అకాల వర్షాలు రైతులను కంట నీరు పెట్టించాయి. పంటను అమ్ముకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో తూకాల్లో తీవ్ర జాప్యంతో ఆందోళనకు గురవుతున్నారు.
మరో పక్క గత వారం రోజుల నుంచి మబ్బుల పట్టిన ఆకాశంలో ఎప్పుడు అకాల వర్షాలు కురుస్తాయోనన్న ఆందోళన వెంటాడుతోంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రద్దానంద్ గంజ్,చుట్టూ పక్కల గ్రామీణ ప్రాంతాల్లో పంటను కోసిన నుంచి సుమారి 15 నుంచి 20 రోజుల తరబడి ధాన్యం తూకం జరగక మండుతున్న ఎండల్లో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
శనివారం రాత్రి కురిసిన వర్షానికి ఆరబెట్టిన ధాన్యం తడిసి పోవడంతో రైతులు సతమవుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన వందలాది మంది రైతుల ధాన్యం తడిసిపోయింది. కొందరు రైతులు అదే ధాన్యాన్ని ఎండకు ఆరబెట్టి విక్రయిస్తున్నారు.
ధాన్యాన్ని కుప్పలుగా పోయడంతో మొలకలు వస్తున్నాయి.అలాగే మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపుతున్న నేపథ్యంలో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వడగళ్ల వర్షం కురిసిన రోజు తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని అధికారులు రైతులకు భరోసా ఇచ్చారు.
కాని ఎక్కడా తడిచిన ధాన్యం కొనుగోలు చేయడం లేదు. జిల్లాలో ఇప్పటివరకు కేవలం 20 శాతం మాత్రమే కొనుగోలు జరిగినట్లు తెలుస్తోంది. గోదాముల వద్ద పోసిన ధాన్యం 10 రోజులు గడిచినా తూకం వేయడానికి హమాలీలు రావడంలేదని వాపోయారు. హమాలీలు, కాంటాల సంఖ్య పెంచి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని జిల్లా రైతులు అనేక ప్రాంతాల్లో రోడ్డెక్కారు.
కోటగిరి బీమ్ గల్ వేల్పూర్ దర్ పల్లి ప్రాంతాల్లో కొనుగోళ్ల పక్రియ లో జాప్యం జరిగింది. రైతుల ఆందోళనల నేపథ్యం లో బిఆర్ యస్ బీజేపీ లు ఆలస్యంగా నైన సరే రంగంలోకి దిగాయి.
