Thursday, April 16, 2026
HomeLaw and Orderవేసవి శిబిరం...అమ్మాయిల నైపుణ్యానికి మెరుగులు.. ముగిసిన వేసవి శిబిరం..జిల్లా జడ్జి భరత లక్ష్మి..

వేసవి శిబిరం…అమ్మాయిల నైపుణ్యానికి మెరుగులు.. ముగిసిన వేసవి శిబిరం..జిల్లా జడ్జి భరత లక్ష్మి..

వేసవి సెలవులు అనగానే విద్యార్థినులను, బంధువుల ఇళ్లు, విహారయాత్రలు పంపిస్తుంటారు. నేటి పోటీ ప్రపంచంలో అన్ని విషయాల్లో అందరిలో ముందుంటేనే గుర్తుంపు ఉంటుందనీ జిల్లా జడ్జి భరత లక్ష్మి పేర్కొన్నారు. నిజామాబాద్ పోలీస్ శాఖ ఆద్వర్యంలో ఏప్రిల్ 25 న ప్రారంభమై శుక్రవారంతో ముగిశాయి.

ఈ శిబిరం లో మొత్తం సుమారు 150 మంది విద్యార్థినిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ వేసవి సెలవుల్లో విద్యార్థులు అదనపు నైపుణ్యం సంపాదించడంపై దృష్టి సారిస్తే జీవితంలో రాణించవచ్చు. తద్వారా శారీరక, మానసిక వికాసం పెంపొందుతుంది.

మెదడు చురుగ్గా పనిచేస్తుందనీ తెలిపారు. అందుకే వేసవి సెలవులు వృథా చేయకుండా పిల్లలకు ఏదో ఒకటి నేర్పంచాలని తల్లితండ్రులు కోరారు. బాలానం శత మార్కటం… అంటే ఒక్క పిల్లాడు వంద కోతులతో సమానమని తెలిపారు. ఈ వేసవి శిబిరంలో ఇంత క్రమశిక్షణగా ఉండడం గమనార్హం అని తెలిపారు.

ముఖ్యంగా ఆడపిల్లలకు ఆత్మరక్షణ పెంపొందించడం, నేరాల పట్ల అవగాహన ఉండాలని,సమాజంలో తమని తాము రక్షించుకోవడానికి అవసరమైన నైపుణ్యాలు ధైర్యంగా ఉండాలని సుంచించరు. ప్రస్తుత కాలంలో ఎక్కువగా బాలికపై అఘాయిత్యాలు రోజురోజుకి పెచ్చరిల్లిపోతున్నాయనీ అందుకు తమని తాము రక్షించుకోవడం కోసం తైక్వాండో లాంటివి ప్రతి ఒక్కరికీ అవసరమని పేర్కొన్నారు.

అదేవిధంగా శారీకంగానే కాకుండా మానసికంగా కూడా దృఢంగా ఉండాలని విద్యార్థులకు తెలిపారు. ప్రతి చదువు ఉత్తమ మార్గంలో నడిపించే విధంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ వారి ప్రవర్తన మెరుగుపరచుకుంటే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని తెలిపారు.

ఈ వేసవి కాలంలో నిర్వహించే శిబిరాలను కచ్చితంగా వినియోగించుకొని,చుట్టూ పక్కల వారికి కూడా తెలపాలని అన్నారు. అలాగే సమాజంలో చాలావరకు మత్తుకు వ్యసనంగా మారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారని, అలాగ మత్తుకు బానిసగా కాకుండా వాటి జోలికి వెళ్లకుండా మనం మన ఇంట్లో నుంచే అవగాహన ప్రారంభించాలని సూచించారు.

ఇంట్లో తల్లిదండ్రులను గౌరవించి వారి సమాజంలో ఎవ్వరిని గౌరవించలేరని,కావున ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను గౌరవించి తల్లిదండ్రుల ముఖ్యతా తెలుసుకోవాలని తెలిపారు. ఈ వేసివి శిబిరంలో నేర్చుకున్న ప్రతి విషయం ఆచరించాలని విద్యార్థులకు తెలియపర్చారు.

అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు.విద్యార్థులకు తొలి అడుగు..జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య..ఈ వేసవి శిబిరం విద్యార్థినీల భవిష్యత్తుకు తొలి అడుగుగా ఉపయోగపడుతుందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు.

వేసవి సెలవులు మానుకొని వారం రోజులుగా నిరచించే ఈ వేసవి శిబిరంలో ఆడపిల్లలు వివిధ అంశాల పట్ల ప్రత్యేక దృష్టి సారించినా విద్యార్థులను అభినందించారు. నార్కోటిక్,సైబర్ క్రైమ్, ట్రాఫిక్ రూల్స్, నేరాల పట్ల అవగాహన కల్పించడం శిబిరంలో వారు తమను తాము రక్షించుకోవడానికి అవసరమైన నైపుణ్యాలను, దైర్యాన్ని ఎలా పొందాలనే దానిపై శిక్షణ నిర్వహించినట్లు తెలిపారు.

అలాగే సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగిన స్థానిక పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. గంజాయి,డ్రక్స్ లాంటివి మీ చుట్టూ పక్కల కార్యకలాపాలు నిర్వహిస్తున్న మాకు తెలపాలని అన్నారు. 2024వ సంవత్సరంలో జిల్లాలో 323 రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు తెలిపారు.

కోవిడ్ సమయంలో కూడా ఇంత మంది మృతి చెందలేరని అన్నారు.అందుకే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ విధిగ పాటించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపిఎస్ సాయి కిరణ్, నార్త్ రూరల్ సీఐ సురేష్ కుమార్, రిటైడ్ ఇన్స్పెక్టర్ కిషన్, పోలీస్ సిబ్బంది,విద్యార్థిని తల్లితండ్రులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!