జక్రాన్ పల్లి మండలంలో ని జాతీయ రహదారి పై కారు కల్వర్టు కు ఢీ కొన్న ఘటనలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందాగా కారు డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి.
నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని లోతర్య తండాకు చెందిన బానోవత్ అశ్విని (19), బానోవత్ మంజుల (17) వీరు ఇద్దరు అక్క చెల్లెల్లు హైదరాబాద్ లో ఎంసెట్ పరీక్ష రాయడానికి కారులో వెళ్లి పరీక్ష రాసి తిరిగి కారులో వస్తుండగా ఆర్గుల్ శివారులో జాతీయ రహదారి పై ప్రమాదావశత్తు కారు ఆదుపు తప్పి కల్వర్టు కు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది .
ఈ ప్రమాదంలో అశ్విని, మంజుల ఇద్దరు ప్రమాద స్థలంలో మృతి చెందగా కారు డ్రైవర్ జాదవ్ హంసరాజు కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి కు తరిలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
