ఫోటో రైటప్ : డోర్ ను ధ్వంసం చేసిన ఫైల్ ఫోటో.బోధన్ రూరల్ : సాలురా మండలం హున్సా ప్రభుత్వ పాఠశాలలో దొంగలు గురువారం రాత్రి బీభత్సం సృష్టించారు.
పాఠశాల తలుపులను బద్దలు కొట్టారు.లోపలికి చొరబడి బీరువాల తాళాలను పగలగొట్టడానికి ప్రయత్నించారు.
తాళాలు పగలకపోవడంతో దొంగలు తిరిగి వెళ్లి ఉంటారని పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు.ఉపాధ్యాయుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
