మందకృష్ణ మాదిగ నాయకత్వంలో 1996 నుండి క్రియాశీలకంగా వర్గీకరణ సాధన కోసం పనిచేసిన నాంపల్లిని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు మాదిగ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు దేవేంద్ర ప్రసాద్ గారు మాదిగ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నాంపల్లి గారిని నియమించారు
నాంపల్లి గారు మాట్లాడుతూ 1996 నుండి జిల్లాలో ఎమ్మార్పీఎస్ జిల్లా కోఆర్డినేటర్ గా మరియు మాదిగ ఉద్యోగుల సమాఖ్య జిల్లా అధ్యక్షుడిగా చాలా సంవత్సరాలుగా పనిచేయడం జరిగింది రాష్ట్రంలో కూడా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మరియు పోలిట్ బ్యూరో సభ్యునిగా పనిచేశాను
తిరిగి మాదిగ ఉద్యోగుల సంఘం లో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా స్థానం కల్పించిన గౌరవ పద్మశ్రీ అవార్డు గ్రహీత మందా కృష్ణ మాదిగ గారికి మాదిగ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు దేవేంద్ర ప్రసాద్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు
భవిష్యత్తులో గౌరవ మందకృష్ణ మాదిగ గారు ఏ పిలిపించిన ఆ పనిలో ముందు ఉంటానని ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి నా వంతు కృషి చేస్తానని ఈ పదవికి న్యాయం చేస్తానని నాంపల్లి తెలిపారు
