HomeEditorial Specialఆనాధ ఆత్మలకు సాయి ఆత్మీయ పలకరింపు .......ఒకే సారి 129 మంది కి పిండి ప్రదానం...

ఆనాధ ఆత్మలకు సాయి ఆత్మీయ పలకరింపు …….ఒకే సారి 129 మంది కి పిండి ప్రదానం ………..కాశీ కి వెళ్లి మరీ శాస్రోక్తంగా కార్యం పూర్తీ ……..ఇప్పటిదాకా చేసిన అంతక్రియలు చేసిన అనాధల చివరికి కతృవు ….

మానవ సేవే మాధవ సేవ అంటారు కదా …….కానీ అనాధ శవాలకు అంతక్రియలు చేయడం అంత కన్న ఎక్కువ అంటారు అదీ కూడా ఆయన సామజిక బాద్యతగానే భావిస్తారు.

రోడ్ల మీద దిక్కుమొక్కు తెలియనోళ్లను చేరదీయడమే కాదు ఆకలేస్తే అన్నం పెడుతాడు …….అనారోగ్యం తో కదల లేకపతే సపర్యలు చేస్తాడు. ఏ దిక్కులేని శవాలకు ఆయనే శాస్రోక్తంగా దగ్గరుండి అంతక్రియలు చేస్తారు.

ఇంకా అడుగు ముందుకేసి వారి ఆత్మ లు శాంతించేలా కాశీ కి వెళ్లి ఇప్పటిదాకా తాను అంతక్రియలు చేసిన వారికి సామూహికంగా పిండ ప్రదానం చేసి వచ్చారు.

సామజిక సేవ చేయాలనే ఓ బృహత్తర లక్ష్యంతో కలిసి వచ్చే అరడజన్ మంది దోస్తులతో ఇందూర్ యూత్ అసోసియేషన్ వేదికను ఏర్పాటు చేసిన సాయి బాబా మొదట్లో రోడ్ల వెంబడి ఉండే యాచకులను చేరదీసి తీవ్ర అనారోగ్యం తో ఉండే వారికి ఆసుపత్రి కి తరలించే వాడు.

కానీ అదొక్కటే ఆయనకు తృప్తి ఇవ్వలేదు అదే ఆసుపత్రి లో అనాధ శవాలకు అంతక్రియలు చేయడానికి మున్సిపల్ సిబ్బంది పోలీసులు పోట్లాడుతుండడం ఆయన హృదయం ను కదిలించింది. ఓ అనాధ శవం అప్పటికే మార్చురీ మూడు రోజులుగా ఉంది పూర్తిగా కుళ్లిపోయింది.

ఎహే దీనికెందుకు పంచాయితీ నేనే చేస్తే పదండి అంటూ మున్సిపల్, పోలీస్ లను పురమాయించాడు. అయినవాళ్లు ఆత్మీయులు వారించారు. కానీఅదికూడా సామాజిక బాధ్యతే అంటూ వారిని మెప్పించాడు.

అక్కడితో మొదలైన ఆయన కొత్త బాధ్యత ఈ పదేళ్లలో 131 అనాధ శవాలకు అంతక్రియలు చేసారు. ఆలా అని ఈ అంతక్రియలను ఆషామాషీగా చెయ్యరు. ఆచారవ్యహావరలను పక్కాగా అనుసరిస్తారు.ఇందులో క్రిస్టియన్, ముస్లిం మతాలకు లకు చెందిన శవాలకు సైతం ఆయా మతాచారాల మేరకే అంతక్రియలు చేసారు.

///////////////// స్వతంత్ర భారతం లో చావు కూడా పెళ్లిలాంటిదే అంటారు కాదు ఈ రోజుల్లో అంతక్రియలు చేయాలంటే వ్యయ ప్రయాసలే కాదు ఎంతో వ్యయం కూడా ! వారసత్వంగా కోట్ల రూపాయల ఆస్థి దక్కినా తమ తల్లి దండ్రుల శవాలకు అంతక్రియలు చేయడానికి వారసులు మొండికేస్తున్న దుష్టాంతాలు అనేక చదివాం కానీ సాయి ఈ దశాబ్ద కాలం వంద మందికి పైగా అంతక్రియలు చేసాడంటే ఆ బృహత్తర కార్యం వెనుక ఎంత కఠోర శ్రమ వుందో కదా ! ఒక్కో మృతదేహం కు అంతక్రియలు చేయాలంటే సుమారు గా పది వేల రూపాయలు ఖర్చు.

ఎలాగో తాను నాటిన సంస్థ మహావృక్షంగా మారింది కదా అందులో సభ్యులు నెలవారీగా ఇచ్చే రుసుం నుంచే ఈ మహా యజ్ఞం కోసం వెచ్చిస్తున్నాడు. అందులోనూ కరోనా లాంటి విపత్తులోనూ ఆయన కార్యదీక్ష ను వదలేదు సామజిక బాధ్యత లో ప్రాణాలు సైతం తృణ పణామే అనుకున్నారు.

ఇంట్లో కళ్ళ ముందే ఉండే వ్యక్తి కరోనా పొతే కనీసం మొఖం కూడా చూడడానికి సాహసించలేదు. కానీ సాయి మాత్రం వెనకడుగు మాత్రం వేయలేదు. చేస్తే వారిని కాటికి చేర్చే వారే వుండరు. ఆలా దహన సంస్కారాలకు సైతం నోచుకోక అనేక మతదేహాలు ఆసుపత్రుల్లో గుట్టలుగా పడిఉంటాయి.

అయినా వాళ్ళు వచ్చి అంతిమ కార్యాలు చేస్తారేవెూనని ఆ దేహాలు కుళ్ళిపో కుండా వుండడానికి నానా తంటాలు పడుతారు. కానీ ఎవ్వరూ రాక కుళ్లిపోతున్న ఆ దేహాలకు అంతక్రియలు చేయించడానికి పోలీసులు పడే కష్టాలు అన్నీఇన్నీ కావు .

ఆర్థిక భారం సంగతి ఎలా ఉన్న దహన సంస్కారాలు చేయడానికి ఎవ్వరూ ముందు రారు కదా.కానీ సాయి మిత్ర బృందం కు దహన సంస్కారాలు చేయాల్సి వుందని చెప్పడమే ఆలస్యం క్షణాల్లో వాలిపోతాడు.

మద్దకూరి సాయి బాబా తన సేవ దృక్పథం లో మరింత పరిణితి ని సాధించాడు ఏ దిక్కు లేని మత దేహాలకు ఆత్మీయుడిగా మారడం కాదు ఆత్మలకు సైతం ఆత్మీయ పలకరింపు ఉండలని అప్పుడే ఈ పక్రియ కు పరిపూర్ణత వుంటుందని కొందరు హిత బోధ చేసారు.

చనిపోయిన పెద్దలకు పిండ ప్రదానం చేయడం అనివార్యంఅని చెప్పారు అందుకే ఇప్పటిదాకా తాను అంతక్రియలు చేసిన వారికి పిండ ప్రదానం చేయడానికి సిద్ధం అయ్యాడు.

అదికూడా పిండ ప్రధానాలకు కేరాఫ్ అడ్రస్ గా చెప్పే వారణాసి (కాశీ ) లో అదికూడా 129 మందికి పేరుపేరునా ఒకే సారి అత్యంత శాస్రోక్తంగా జరిపించాడు. తన సేవ ప్రస్థానంలో ఇదో బహత్తర కార్యంగానే సాయి చెప్తారు.

అవునూ నేను మా అమ్మకు ఎలా దహన సంస్కారాలు చేసానో మిగితా అనాధ శవాలకు అంతక్రియలు చేసేటప్పుడు అదే హదయ వేదనతోనే చేస్తాను అని సాయి బాబా కన్నీళ్ల పర్యంతం అయ్యారు .

సేవ కార్యాల్లో నా వెంట ఉన్న మిత్ర బృందం నాకు అండగా ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments