నిజామాబాద్ నగరంలోని సాయి నగర్ లో సోమవారం తెల్లవారు జామున చైన్ స్నాచింగ్ జరిగింది. అదే ప్రాంతానికి చెందిన గాలేగాం మాదవి రోజు లాగే సోమవారం తెల్లవారు జామున అయిదింటికి భర్త రాధాకృష్ణ తో కలసి వాకింగ్ కోసం వెళ్ళింది విశ్వ వికాస్ స్కూల్ వద్ద ఇద్దురు యువకులు నెంబర్ ప్లేట్ లేని బైక్ మీద వేగంగా వచ్చి మాదవి మెడలో నుంచి పుస్తెల తాడు ను లాగారు కానీ సగభాగంమే తెగింది మిగితా సగం ఆమె మెడలోని ఉండిపోయింది.
దీనితో ఆమె గట్టిగా కేకలు వేయడంతో వారు బైకు మీద పారిపోయారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన వచ్చారు చైన్ స్నాచర్ల కోసం గాలించారు బాధితురాలి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
