HomeCRIMEఫిట్‌నెస్‌ లేని బస్సులు రోడ్డెక్కితే కేసులే..

ఫిట్‌నెస్‌ లేని బస్సులు రోడ్డెక్కితే కేసులే..

ఫిట్ నెస్ లేని పాఠశాల బస్సులు రోడెక్కితే కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని సంయుక్త రవాణా శాఖ కమిషనర్ చంద్ర శేఖర్ హెచ్చరించారు.సోమవారం జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల యామాన్యాలతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జూన్ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పాఠశాలలో యాజమాన్యాలు తప్పనిసరి వారి బస్సులకు ఫిట్ నెస్ చేయించాలని తెలిపారు.బడి పిల్లల భద్రత పాఠశాలల ప్రధాన అంశం అని చెప్పారు.

అలాగే 15 సంవత్సరాలు దాటిన బస్సులు నిషేధించినట్లు తెలిపారు.15 సంవత్సరాలు దాటిన బస్సులు రోడెక్కితే విద్యాసంస్థ పైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో మొత్తం 780 పాఠశాలల బస్సులు ఉన్నాయని,అందులో ఇప్పటి వరకు 180 వరకు బస్సులు మాత్రమే ఫిట్ నెస్ చేయించారు అని చెప్పారు.

పాఠశాలలు పునఃప్రారంభం నాటికి ప్రతి ఒక్కరూ వారి బస్సులను సామర్థ్యం కలిగి ఉండాలని సూచించారు. అలాగే బస్సు డ్రైవర్ ల వయస్సు 60 సంవత్సరాలు దాటరాదని,ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్న వారిని మాత్రమే డ్రైవర్ గా ఉంచాలని తెలిపారు.

ముఖ్యంగా డ్రైవర్ విషయంలో నిర్లక్ష్యం ఉండకూడదని తెలిపారు. అలాగే ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు కూడా గమనించాలని తెలిపారు.

ముఖ్యంగా కొందరు తల్లిదండ్రులు ఎక్కువ మంది ఉన్న ఆటోలలో పంపిస్తూ, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి, రవాణా శాఖ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం ఒక స్కూల్ బస్సు రోడ్ ఎక్కాలంటే తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి అని అన్నారు.

అందులో ప్రధానమైంది ఫిట్నెస్, టైర్లు, బ్రేక్ తదితర సాంకేతిక సామర్థ్యం పట్ల సంతృప్తి చెందితేనే సర్టిఫికెట్ జారీ చేస్తామన్నారు. అలాగే ప్రస్తుతం కరోనా,వివిధ వ్యాధులతో మృతి చెందిన వారికంటే,రోడ్డు ప్రమాదాలలో ఎక్కువగా మరణిస్తున్నారని తెలిపారు.

దీనిలో భాగంగా మొన్నటి వరకు రోడ్డు భద్రతా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.80 శాతం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే అధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

గత సంవత్సరం పాఠశాల బస్సుల రోడ్డు ప్రమాదాలు ఒక్కటి కూడా జరగలేదని అందుకు సిబ్బందిని,పాఠశాలల యామాన్యాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో డిటిఓ దుర్గా ప్రమీల, ఆర్టివో ఉమామహేశ్వర్, ఆర్టీఏ సభ్యుడు నరేందర్,ఎంవీఐ లు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments