HomeTelanganaNizamabadనెహ్రూ సేవలు ఎన్నటికి మరువలేనివి..

నెహ్రూ సేవలు ఎన్నటికి మరువలేనివి..

మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ సేవలు ఎన్నటికి మరువలేనివనీ యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ,ఎన్ఎస్ యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరదబాటు వేణు రాజ్, పేర్కొన్నారు.

మంగళవారం భారత మొదటి ప్రధాని స్వర్గీయ పండిత్ జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ మరియు రాష్ట్ర NSUI ప్రధాన కార్యదర్శి వేణు రాజ్ మాట్లాడుతూ. జవహర్ లాల్ నెహ్రూ దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లిన నాయకుడని, బ్రిటిష్ వారు దేశాన్ని పూర్తిగా దోచుకున్న తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నెహ్రూ భారత దేశంలో ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకొని దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించారాని తెలిపారు.

పంచవర్ష ప్రణాళిక ద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారని ఆయన అన్నారు.నెహ్రూ భూపునఃపంపిణి విధానాన్ని అనుసరించడంతో పాటు నీటిపారుదలకు కాలువలు త్రవ్వించడం, ఆనకట్టలు కట్టించడం , వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదలకు ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు చేపట్టారాణి ఆయన తెలిపారు.

అదేవిధంగా నెహ్రూకి నిజామాబాద్ జిల్లాలతో ఎంతో అవినాభావ సంబంధం ఉందని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో నెహ్రూ గారు నిజామాబాద్ జిల్లాకు వచ్చారని, నిజామాబాద్ జిల్లాలో రైతులకు లక్షల ఎకరాలకు నీరు రాడానికి శ్రీరామ్ నగర్ సాగర్ కారణమని ఆయన అన్నారు.ఎయిమ్స్, ఐఐటీ లు,csir ల్యాబ్లు మరియు అంతరిక్షం , అణు కార్యక్రమాలు వంటి సంస్థలు నెహ్రూ గారి దృష్టి మూలంగా వచ్చాయని, నెహ్రూ విధానాలను ఆశయాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు అందిపుచ్చుకొని ముందుకు వెళ్లాలని ప్రజలకు తెలియజేయాలని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్,ఫిషర్మాన్ చైర్మన్ శ్రీనివాస్,మాజీ ఎంపీపీ దశ గౌడ్,నగర SC సెల్ అధ్యక్షులు వినయ్,మహిళా కాంగ్రెస్ నాయకులు పోల ఉష,జిల్లా ప్రతినిధి లవంగ ప్రమోద్, అవిన్,నగర కాంగ్రెస్ ఉపాధ్యకులు నరేందర్ గౌడ్,నరేంద్ర సింగ్,స్వామి గౌడ్,పుప్పాల విజయ,సంగెం సాయిలు,ముశ్షు పటేల్, సాయి కుమార్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments