HomeTelanganaNizamabadరాష్ట్ర కులగణన ఓ తప్పుల తడక..బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌

రాష్ట్ర కులగణన ఓ తప్పుల తడక..బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌

తెలంగాణలో రేవంత్‌ సర్కారు చేసిన కులగణన నివేదిక అశాస్త్రీయమైందని,పూర్తిగా తప్పుల తడకగా ఉందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌ ఆరోపించారు.

ప్రధాని మోదీ నాయకత్వంలో రాజకీయ వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ రాబోయే జనాభా లెక్కింపులో కులగణనను చేర్చాలని తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైందని పేర్కొన్నారు.

ఆదివారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. 12 శాతం ముస్లింలలో 10 శాతం మందిని ఓబీసీలుగా చూపి, బీసీ వర్గాలకు తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు.

మతపరమైన రిజర్వేషన్లు దిద్దుబాటు కావని కోర్టులు మొట్టికాయలు చేసిన, బీసీ ల పొట్ట కొట్టడమే కాంగ్రెస్ విధానం అని విమర్శించారు.

అంబేడ్కర్‌ సిఫారసు చేసిన బీసీ కమిషన్‌ను కాంగ్రెస్‌ గతంలో పార్లమెంట్‌లో చర్చకు తీసుకురాలేదన్నారు. నెహ్రూ నుంచి రాజీవ్‌ వరకు కాంగ్రెస్‌ నేతలంతా బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకమేని లక్ష్మణ్‌ తెలిపారు.

అందుకే నరేంద్ర మోదీ ప్రభుత్వం జనగణన తో కుల గణన చేయడం చరిత్రాత్మక నిర్ణయం అని తెలిపారు. చివరిసారిగా 1931లో బ్రిటిష్‌ ప్రభుత్వం కులగణన చేసిందని, 94 ఏళ్ల తర్వాత మోదీ మళ్లీ ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. కులగణన విషయంలో తెలంగాణ రోల్‌ మోడల్‌ అంటూ రాహుల్‌, రేవంత్‌ ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.

తొలిసారిగా ఎన్డీయే ప్రభుత్వం బిహార్‌లో కులగణన చేపట్టిందని, ఆ నివేదికను అసెంబ్లీలో చట్టరూపం దాల్చేలా చేసిందని లక్ష్మణ్‌ చెప్పారు. తెలంగాణలో ఇటీవల చేసిన కులగణన వివరాలను ఇంతవరకూ ప్రభుత్వం ఎందుకు బహిర్గతం చేయలేదని ప్రశ్నించారు.

మొరార్జీ దేశాయ్‌ ప్రధానిగా ఉన్నప్పుడు బీసీల అభ్యున్నతి కోసం మండల్‌ కమిషన్‌ ఏర్పాటు చేశారని చెప్పారు. కానీ, జనతా ప్రభుత్వం పడిపోవడం వల్ల ఆ కమిషన్‌ మరుగునపడిందన్నారు.

ఇందిరా గాంధీ ప్రధానిగా సుదీర్ఘకాలం పనిచేసినా మండల్‌ కమిషన్‌ ఊసే ఎత్తలేదని విమర్శించారు. 1990లో వీపీ సింగ్‌ మండల్‌ కమిషన్‌ సిఫారసులను అమలు చేస్తే, ప్రతిపక్ష నేతగా ఉన్న రాజీవ్‌ గాంధీ వాటికి వ్యతిరేకంగా మాట్లాడి, ప్రధానిని కుల నాయకుడిగా అభివర్ణించారని లక్ష్మణ్‌ తెలిపారు.

2010లో యూపీఏ ప్రభుత్వం రూ.5000 కోట్ల ఖర్చుతో ప్రైవేట్‌ ఏజెన్సీలతో సర్వే చేపట్టి, వివరాలను బహిర్గతం చేయలేదని విమర్శించారు. భవిష్యత్తులో జనగణనతో పాటే కులగణన కూడా జరుగుతుందని 2018లోనే రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారన్నారు.

ఇంత జరుగుతున్నా రాహుల్‌ ఏనాడూ స్పందించలేదని చెప్పారు. ప్రధాని మోదీ బీసీల సంక్షేమం కోసం.. బీసీ కమిషన్ కు రాజ్యాంగ బద్ధత ఇచ్చారని, కేంద్రీయ విద్యాలయాలు,సైనిక్ స్కూల్, నవోదయ లాంటి పరీక్షల్లో 27% రిజర్వేషన్లు కల్పించారని అన్నారు.

గత పదేళ్లుగా బీసీలు నాణ్యమైన ఉన్నతవిద్యకు నోచుకుంటున్నారని తెలిపారు. బీసీల అవకాశాలను దెబ్బతీస్తున్న కాంగ్రెస్ తీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.

జమ్మూకశ్మీర్లో 75 ఏళ్లపాటు రిజర్వేషన్లు లేవని..మోదీ 370 తొలగించిన తర్వాతే వారందరికీ రిజర్వేషన్లు అందాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలతోపాటు. అగ్రవర్ణాలకు ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు ఇచ్చిందే మోదీ అని…రిజర్వేషన్లు పెంచిందే బీజేపీ అని లక్ష్మణ్ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి,స్రవంతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments