HomeTelanganaNizamabadఅర్బన్ లో ఇందిరమ్మ ఇళ్ళకు సాంకేతిక కొర్రీలు..!పేరుకే నియోజకవర్గానికి 3,500 ఇళ్లు..

అర్బన్ లో ఇందిరమ్మ ఇళ్ళకు సాంకేతిక కొర్రీలు..!పేరుకే నియోజకవర్గానికి 3,500 ఇళ్లు..

అర్బన్ లో ఇందిరమ్మ ఇళ్ళకు సాంకేతిక కొర్రీలు..!పేరుకే నియోజకవర్గానికి 3,500 ఇళ్లు..

జిల్లాలో 752 మందికే మంజూరు..కఠిన నిబంధనలతో లబ్ధిదారుల్లో అయోమయం..నిర్దిష్ట ప్రమాణాల్లోనే కట్టుకోవాలని కొర్రీలురాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం ఒక్క అడుగులు ముందుకు..

రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతున్నది.ఇంటి నిర్మాణంలో కఠిన నిబంధనలతో లబ్ధిదారులు అయోమయం అవుతున్నారు.

ఎన్నికల్లో సమయంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు అందజేస్తామని గప్పలు చెప్పి ఇప్పుడు సాంకేతిక లోపాల పేరుతో కొర్రీలు పెడుతున్నారు.

ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇస్తామని చెప్పారు. అర్బన్ నియోజకవర్గానికి ఇప్పటి వరకు మంత్రి నుంచి కేవలం 752 మందికి మాత్రమే మంజూరు చేసింది.అందులో 501 సరైన డాక్యుమెంట్ జనరేట్ అయ్యాయని అధికారులు అంటున్నారు.

వాటిలో 40 ఇండ్లకు మాత్రమే నిర్మాణ పనులు ప్రారంభించారు.అర్బన్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు కేవలం 40 ఇళ్లకు మాత్రమే మొగ్గు పోయడంతో విమర్శలు వెలువెతుతున్నాయి.

మొన్న జరిగిన సమీక్ష సమావేశంలో అర్బన్ నియోజకవర్గంలో కేవలం ఒక్క ఇంటికి మాత్రమే మొగ్గు పోసినట్లు స్వయంగా జిల్లా కలెక్టరే పేర్కొన్నారు.

ఎంతో మంది కాంగ్రెస్ నేతలు ఉన్న,జిల్లా ఇంచార్జి మంత్రి ఉన్న ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభించడంలో అర్బన్ నియోజకవర్గం వెనుకంజలో ఉంది.

ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభమై రోజులు గడుస్తున్న పూటకోమారు గృహ నిర్మాణ శాఖ అధికారులు వచ్చి నిబంధనల మేరకే ఇళ్లు కట్టాలంటూ చెబుతుండడంతో లబ్ధిదారులు బెంబేలెత్తుతున్నారు.

నిబంధనల మేరకు కాకుండా ఏ కాస్త అటుఇటు కట్టినా బిల్లులు రావని చెబుతుండడంతో భయాందోళనకు గురవుతున్నారు.రాష్ట్ర ప్రభు త్వం ఈ నిబంధనను పట్టించుకోకుండా ఎంత వైశాల్యంలోనైనా ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకోవచ్చని తొలుత చెప్పింది.

అయిన అటు అధికారులు ఇవ్వని పట్టింపు లేకుండా నిబంధనల పేరుతో కొర్రీలు పెడుతున్నారు. అర్బన్ లో అరకొరగా మంజూరైన ఇళ్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి.

దీంతో ఇంకెన్నాళ్లు ఇళ్ల కోసం ఎదురుచూడాల్సి వస్తుందోనని నిరుపేదలు ఆందోళన చెందుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments