HomeCRIMEగల్లంతయిన ముగ్గురు యువకుల మృతదేహాలు లభ్యం..-నిజాంసాగర్ బ్యాక్ వాటర్ లో వెలికితీత. --పోస్టుమార్టం కోసం ప్రభుత్వ...

గల్లంతయిన ముగ్గురు యువకుల మృతదేహాలు లభ్యం..-నిజాంసాగర్ బ్యాక్ వాటర్ లో వెలికితీత. –పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి మృతి దేహాలు..–మూడు కుటుంబాల్లో విషాదం.

క్రికెట్ ఆడడానికి వెళ్లిన ముగ్గురు యువకులు నిజాంసాగర్ బ్యాక్ వాటర్ లో గల్లంతైన వారి మృతదేహాలు మంగళవారం లభ్యం అయ్యాయి. ఎల్లారెడ్డి మండలంలో సోమవారం సాయంత్రం జరిగింది.

మండలంలోని సోమరిపేట గ్రామానికి చెందిన హర్షవర్ధన్ (16), తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన నవీన్ (17), ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన మధుకర్ గౌడ్ (17) నిజాంసాగర్ బ్యాక్ వాటర్ లో గల్లంతయ్యారు.

రాత్రి 9 అయినా వారి మృతదేహాలు లభ్యం కాకపోవడంతో గజ ఈతగాళ్లు బ్యాక్ వాటర్ లో మృతదేహాల కోసం గాలిస్తున్నారు.

ఈ విషాద సంఘటనకు సంబంధించి న వివరాలు గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి. మండలంలోని సోమార్పేట్ గ్రామంలో 11 మంది యువకులు క్రికెట్ ఆడారు. సాయంత్రం ఆట ముగిసేసరికి చెమటతో తడిసిపోయారు.

దీంతో అందరు కలిసి సోమార్పేట్ నిజాంసాగర్ మండలం హసన్పల్లి గ్రామంలో మధ్య గల నిజాంసాగర్ బ్యాక్ వాటర్ వద్దకు వెళ్లారు. 11 మంది స్నేహితులు స్నానం చేసేందుకు బ్యాక్ వాటర్ లోకి దిగారు. ఈత వచ్చిన కొంతమంది ముందుకు ఈదుకుంటూ వెళ్లారు.

కొంచెం లోనికి వెళ్లిన హర్షవర్ధన్, నవీన్, మధుకర్ గౌడ్ నిజాంసాగర్ బ్యాక్ వాటర్ లో ఉన్న బురదలో చిక్కుకున్నారు. వారు బయటకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఆహాకారాలు చేశారు.

ఒడ్డుకు దగ్గరలోనే స్నానం చేస్తున్న మిగతా ఎనిమిది మందికి పెద్దగా ఈత రాదని చెప్పారు. దాంతో వారు కూడా అరుపులు పెడ బొబ్బలు పెట్టారు. వారు అరుస్తూ ఉండగానే ముగ్గురు యువకులు నీట మునిగి గల్లంతయ్యారు.

వెంటనే మిగతా యువకులు గ్రామానికి వచ్చి గ్రామస్తులకు విషయం గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఎల్లారెడ్డి, నిజాంసాగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.

సాయంత్రం ఏడున్నర ప్రాంతంలో గజ ఈతగాళ్లను రప్పించి గల్లంతైన యువకుల కోసం వెతికించారు. రాత్రి కావడంతో పరిస్థితులు అనుకూలంగా లేవు అని పోలీసులు చెప్పారు. యువకుల మృతదేహాల మృతదేహాల కోసం గాలింపు చర్యలు గత రాత్రి నుంచి ఏకధాటిగా సాగించారు .

ముగ్గురు యువకులు ఒకేసారి గల్లంత అయి మృతదేహాలు లభ్యం కావడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments