రాత్రి వేళల్లో తాళం వేసిన ఇండ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా దొంగల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆరవ టౌన్ పరిధిలోనీ తాళం వేసిన ఇండ్లలో 8 మందితో కూడిన దొంగల ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకొని రిమాండ్ కు తరలించి,వారి నుంచి 15 తులాల బంగారం, ఒక కారు,3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసినట్లు సిపి సాయి చైతన్య తెలిపారు. మంగళవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.
ఆరవ టౌన్ పరిధిలోనీ పలు కేసుల్లో విచారణ చేపట్టగా ఇటీవల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా చూడగా హైదారాబాద్ కు చెందిన ప్రధాన నిందితుడు మహమ్మద్ ఆమేర్ పై అనుమానం తో పట్టుకొని విచారించినట్లు తెలిపారు.
విచారణలో మహమ్మద్ ఆమేర్ మొదట్లో చిన్న చిన్న చోరీలకు పాల్పడుతూ నిజామాబాద్ నగరంలోని ధర్మపురి హిల్స్ కు చెందిన మహ్మద్ అబ్దుల్ ఆసీస్ తో పరిచయం ఏర్పడి తర్వాత అబ్దుల్ ఆసిఫ్ తనకు పరిచయం ఉన్న వసీం, సోహైల్, జావీద్ ఖాస్, రియాజ్, అలీ, ఆసిఫ్ ఖాన్ లను అమెర్ కు పరిచయం చేసినట్లు తెలిపారు.
వీరందరూ కూడా గతం లో నేరాలకు పల్పడినవారే. వీరు ఒకే ముఠాగా ఏర్పడి నిజామాబాద్, టౌన్ VI, టౌన్ V మరియు రుద్రూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో గల ఆటో నగర్, ధర్మపురి హిల్స్, పెయింటర్ కాలనీ, డ్రైవర్ కాలనీ, అక్బర్ నగర్ కాలనీ, శాంతి నగర్ లలో సుమారుగా (24) ఇండ్ల తాళాలు పగల గొట్టి దొంగతనాలు చేశాము అని ఒప్పుకున్నారని అన్నారు.
దీనితో పోలీస్ వారు వీరందరినీ అదుపులోనికి తీసుకోని విచారించగా వారు చేసిన నేరాలను ఒప్పుకున్నారు.
ఇలా దొంగతనంలో దొంగిలించిన బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను వారు షేక్ వసం ను ఇచ్చేవారనీ, అప్పుడు షేక్ వసిం అలా దొంగలించిన బంగారు ఆభరణాలను తనకు పరిచయం ఉన్న మల్కాపూర్ కు చెందిన మోహన్ కి అమ్మేవారని అన్నారు.
ఇందులో ఉన్న నేరస్తుల అందరు గతం లో అనేక నేరాలు చేసి చాలాసార్లు జైలు కు వెళ్లి వచ్చినారు. షేక్ వసిం 8 కేసులు ఉన్నాయని, అలాగే ఇతని పై గతంలో హైదరాబాద్ లోని మీర్పేట్ పోలీస్ వారు PD ACT కూడా ఉన్నట్లు తెలిపారు. షేక్ సోహైల్
చర్పాటా సోహైల్ గతంలో 7 కేసులు ఒక మర్డర్ కేసు, మహమ్మద్ అమెర్ 21 కేసులు, మహమ్మద్ అబ్దుల్ ఆసిఫ్ 10 కేసులు, జావీద్ ఖాన్ 5 కేసులు, మోహన్ 3 గంజాయి కేసులు ఉన్నాయన్నారు.
వీరితో పాటు దొంగతనలలో పాల్గొన్న ఇంకా ముగ్గురు నిందితులు పరారిలో ఉన్నట్లు తెలిపారు. ఈ కేసు చేదనలో నిజామాబాద్ ఏసిపి రాజా వెంకటరెడ్డి,సౌత్ రూరల్ సీఐ సురేష్ కుమార్,ఆరవ టౌన్ ఎస్ఐ వెంకటరావు,రవి కిరణ్, అభిలాష్, కేర్బాజీ సునీల్, శివ సాగర్ లను అభినందించారు.
