HomeTelanganaNizamabadభూభారతి అవగాహన సదస్సు...

భూభారతి అవగాహన సదస్సు…

భూ రికార్డులో తప్పులను సరిద్దుకోవడానికి రైతులకు మెరుగైన సేవలు అందించడానికి భూ భారతీ చట్టం తీసుకొచ్చినట్టు తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ తెలిపారు.

నిజామాబాద్ జిల్లా అర్బన్ నియోజకవర్గంలోని సిఎస్ఐ గ్రౌండ్ లో నిర్వహించబడిన భూభారతి కొత్త చట్టం గురించి అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిల ఆదేశానుసారం రైతులందరికీ భూభారతి గురించి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.

భూభారతి పోర్టల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల వ్యవసాయ భూముల నిర్వహణకు కోసం భూ వివాదాలు లేని తెలంగాణ లక్ష్యంగా ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ఏప్రిల్ 14న 2025 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి రోజున ఈ తెలంగాణ భూ పరిపాలనలోని ధరణి స్థానంలో కొత్తగా ఆర్.ఓ.ఆర్ చట్టం భూభారతి పోర్టల్-2025 ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించినట్లు తెలిపారు.

ఈ భూభారతి చట్టం వలన రైతులకు ఇబ్బంది కలగకుండా దీనివలన చాలా ప్రయోజనాలు ఉన్నాయన్నారు. భూధార్ అంటే ప్రతి మనిషికి ఆధార్ కార్డు అలాగా ప్రతి భూకమతానికి ప్రత్యేక సంఖ్యతో కూడిన భూదార్ సేవలు,గ్రామస్థాయిలోనే రెవెన్యూ సేవలు, చట్టబద్ధ హక్కుల నమోదు,సాదా బైనమాల క్రమబద్ధీకరణ,పగడ్బందీగా మ్యుటేషన్,భూ రికార్డుల సవరణ,భూ హక్కుల కల్పన ఇలా చాలా ప్రయోజనాలు ఉన్నాయని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో నిజామాబాద్ నార్త్ ఎమ్మార్వో విజయకుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రభాకర్, సంబంధిత అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments