నిజామాబాద్ నగరంలోని నూతన కలెక్టర్ కార్యాలయం పక్కన ఉన్న డబుల్ బెడ్ రూమ్ లను బీజేపీ నాయకుల తో కలసి సందర్శించారు ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచరి మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ప్రభుత్వ విఫలతతో ఇప్పటికీ పేదలకు అందించకుండా నిలిపివేయడం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది.
ప్రజల హక్కుల్ని కాలరాసే విధంగా వాటిని మూలుగులు పెట్టడం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనాకీ పరిపాటికీ నిదర్శనం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు పేదల హక్కు. ఇది ఎవరి సొత్తు కాదు. ప్రభుత్వం వెంటనే పంపిణీ ప్రారంభించాలి.
ఆగష్టు 14 వ అర్థరాత్రి 12 గంటల వరకు మేము వేచి చేస్తాం జిల్లా యంత్రాంగం కు కలెక్టర్ గారికి కూడా తెలియచేస్తున్నాము మీరు అప్పటి వరకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పేదల కు అందచేయండి లేకపోతే, స్వాతంత్ర్య దినోత్సవం అయిన 2025 ఆగస్టు 15న బీజేపీ ఆధ్వర్యంలో పేదల కోసం తాళాలు పంపిణీ చేస్తాం.గృహ ప్రవేశలు చేపిస్తామని జిల్లా యంత్రాగానికి తెలియచేస్తున్నాము ఇది మా డిమాండ్ కాదు — ప్రజల గళం అన్నారు డబుల్ బెడ్‌రూమ్‌లను ఇస్తామంటూ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మూసివేసిన గోడలతో రాజకీయాలు చేస్తున్నారు.
ఇక్కడ పరిస్థితి చూస్తే ఎంత దారుణం పాములు, తిరుగుతున్నాయి చెట్లు మొలకెత్తి కట్టిన ఇండ్లు పేరుకు పోతున్నాయి కలెక్టర్ కార్యాలయానికి కుతవేటు దూరంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ లు పరిస్థితి ఇలా ఉంటే ఏందీ అని తీవ్ర స్థాయి లో మండిపడ్డారు 10సంవత్సరల కెసిఆర్ పాలనా లో ప్రజలకు ఇవ్వకుండా మోసం చేశారు ఇప్పుడు ఇందిరమ్మ కమిటీలా పేరున కాలయాపన చేస్తూ పేదల కు ఇండ్లు ఇవ్వకుండా వారితో చెలగాటం ఆడుతున్నారు ఇది సరైన పద్ధతి మీకు పేద ప్రజల మీద ఎలాంటి ప్రేమ ఉన్న వెంటనే వారికీ అందచేయండి అన్నారు.
ప్రజల కన్నీళ్ల మీద హాస్యం చేయడం సిగ్గుచేటు బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు, గ్రామీణ ప్రజాప్రతినిధులతో కలిసి పేదల గృహ కలను నిజం చేయడమే లక్ష్యంగా పోరాటాన్ని ముమ్మరం చేయనున్నట్టు దినేష్ పటేల్ గారు స్పష్టం చేశారు.బీజేపీ పోరాటం – ప్రజల హక్కుల కోసం ఇళ్లపై రాజకీయాలు ఆపండి వెంటనే పంపిణీ ప్రారంభించండి!
ఈ విషయంలో ప్రజలు ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోకముందే, సరైన నిర్ణయం తీసుకోవాలని, లేకపోతే ప్రజలతో కలిసి బీజేపీ ఉద్యమానికి సిద్ధమవుతుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమం లో జిల్లా ప్రధాన కార్యదర్శి పోతంకర్ లక్ష్మి నారాయణ, రూరల్ కన్వీనర్ పద్మ రెడ్డి, జగన్ రెడ్డి, శంకర్ రెడ్డి,మాస్టర్ శంకర్, ఆనంద్, నరేష్, అమంద్ విజయ్ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
