శుక్రవారం స్థానిక వర్ని చౌరస్తా ఆర్ఆర్ రోడ్ పైన ర్యాలీ తీసి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా ఏబీవీపీ ఇందూరు విభాగ్ కన్వీనర్ కైరి శశిధర్ మాట్లాడుతూ..
ప్రజాస్వామ్య దేశంలో హింస ద్వారా దేనిని సాధించలేరని ఇప్పటివరకు మావోయిజం పేరుతో నక్సలైట్లు సాధించింది శూన్యమని తెలిపారు.
ఈరోజు మన భారతదేశానికి స్వాతంత్రం అహింసా మార్గంలో వచ్చిందని,మొన్నటికి మొన్న తెలంగాణ ఉద్యమం కూడా అహింసా మార్గంలోనే ప్రజాస్వామ్యబద్ధంగా సాధించుకున్న విషయం అందరికీ తెలిసిన విషయమేనాని అన్నారు.
మన రాష్ట్రంలోని కొంతమంది మేధావుల రూపంలో చలామణి అవుతున్న అర్బన్ నక్సలైట్లు యూనివర్సిటీలో చదువుకోవడానికి వచ్చే పేద విద్యార్థుల యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారికి లేనిపోని మాటలు చెబుతూ అడవుల్లోకి వెళ్లేటట్టు ప్రోత్సహిస్తున్నారు .
మావోయిజం మంచిది అని చెప్పే ఈ మేధావులు మరి వారి పిల్లల్ని అడవుల్లోకి పంపించకుండా అమెరికా, ఆస్ట్రేలియా దేశాలకి పంపించి చనిపోయిన నక్సలైట్ల శవాల మీద పేలాలు ఏరుకునే రాజకీయం ఈ అర్బన్ నక్సలైట్లు చేయడం దౌర్భాగ్యమైన విషయమని తెలిపారు.
మావోయిస్టులు శాంతి చర్చలు జరపాలనే డిమాండ్ కంటే తుపాకులు వదిలేసి ప్రభుత్వానికి లొంగిపోయి,ఒక పార్టీని ఏర్పాటు చేసుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లో నిలబడి ప్రజాప్రతినిధులుగా ఎన్నికై ప్రజలకు సేవ చేసుకునే అవకాశం తీసుకోవాల్సిందిగా యావత్ భారత దేశ సమాజం విజ్ఞప్తి చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి వంజరి బాలకృష్ణ ప్రేమ్ కుమార్ ప్రణీత్ సన్నీ మున్నా నరేందర్ దుర్గా దాస్ రాజు దినేష్ వాసు ఈశ్వర్ లక్కీ రంజిత్ విష్ణు అంబరీష్ వంశీ తదితరులు పాల్గొన్నారు
