నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ముందస్తు చర్యలుబక్రీద్ పండుగ (జూన్ 7) సందర్భంగా గోవుల అక్రమ రవాణా, గో హత్యలు జరుగకుండా నివారించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.
ఈ క్రమంలో నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి శ్రీమతి ఏ. అపర్ణా ఆదేశాల మేరకు రెండు ప్రత్యేక నిఘా బృందాలను నియమించారు.
ఈ బృందాలు నవీపేట్, నందిపేట్, డొంకేశ్వర్, మాక్లూర్, నిజామాబాద్ అర్బన్ మండలాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. వాహనాలను తనిఖీ చేసి గోవుల అక్రమ రవాణా జరుగుతోందా అన్న దానిపై నిఘా పెట్టారు.
ముఖ్యంగా నవీపేట్ మండలంతో పాటు నిజామాబాద్ పట్టణంలోని పశువుల ఆవరణలు, మట్కీలు వంటి ప్రాంతాల్లో సైతం ప్రత్యేక తనిఖీలు కొనసాగుతున్నాయి.
ఈ నిఘా బృందాల్లో కే. వెంకటి, ఎండీ ముజయుద్దీన్, ఎండీ సద్దిక్, కే. సంతోష్ రెడ్డి, టీ. జనార్ధన్ లు సభ్యులుగా పాలుపంచుకుంటున్నారు.
ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు ప్రజలు కూడా సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
