వడ్డించే వాడు మనవాడు అయితే ఎక్కడ కూర్చున్న సరే అనే నానుడు సుదర్శన్ రెడ్డి విషయం లో నిజం కాదనిపిస్తుంది. సమీప బంధువు రేవంత్ రెడ్డి సీఎం గా ఉన్నా సరే సుదర్శన్ రెడ్డి కి ఈసారి కూడా మంత్రి పదవీ దక్కలేదు.
చివరి దాక పట్టుబట్టిన అధిష్టానం ససేమిరా అంది. సామాజిక సమీకరణ ల నేపథ్యంలో మంత్రి పదవీ ఇవ్వడం కుదరదని తేల్చేసింది. సో మంత్రి వర్గ విస్తరణ జరిగినా తనకు మంత్రి పదవి దక్కక పోవడం ఫై సుదర్శన్ రెడ్డి కినుక వహిస్తున్నారు.
క్యాబినెట్ లో ఈసారి కూడా జిల్లాకు ప్రాతినిధ్యం దక్కక పోవడం తో కాంగ్రెస్ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిరేవంత్ సీఎం కావడం తో సుదర్శన్ రెడ్డికి తిరుగుండదని అయన సన్నహితులు సంబర పడ్డారు.
ఎందుకంటే సమీప బంధువు కావడంతో పాటు పీసీసీ చీఫ్ కావడంలోనూ సుదర్శన్ రెడ్డి మంత్రాంగం నడిపారు. అందుకే రేవంత్ క్యాబినెట్ లో మంత్రి ఖాయం అని అంతా భావించారు.ఎహే మంత్రి పదవిదేముంది హోమ్ లేదంటే విద్యాశాఖ తీసుకోవాలని అడుగుతున్నారు.
ఇస్తే గిస్తే హోం ఇవ్వాలని మా సార్ అంటున్నాడు అంటూ ఆయన సన్నిహితులు గొప్పగా చెప్పుకున్నారు. అన్నట్లే సీఎం రేవంత్ సుదర్శన్ రెడ్డి కి మంత్రి పదవీ కోసం ఢిల్లీ పెద్దలతో గట్టిగా అరుసు కున్నాడు.
కానీ రెడ్డి సామజిక వర్గం మంత్రులు ఎక్కువ అవుతున్నారంటూ నిరాకరించింది.ఈసారి విస్తరణ ఎప్పుడు జరిగినా బెర్త్ గ్యారెంటీ అని సాక్షాతూ సీఎం సుదర్శన్ రెడ్డి కి భరోసా ఇచ్చారు. అన్నట్లుగానే ఆ శాఖ లు ఎవ్వరికి ఇవ్వకుండా తన వద్దే పెట్టుకున్నారు.
క్యాబినెట్ ఆరు ఖాళీలు కూడా పెట్టారు. ఎట్టకేలకు యేడాదిన్నర సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మంత్రి వర్గ విస్తరణ కోసం కాంగ్రెస్ అధిష్టానం లైన్ క్లియర్ చేసింది. ముగ్గురిని మాత్రమే క్యాబినెట్ లో తీసుకోవాలని మెలిక పెట్టింది.
ఎవరెవరికి ఇవ్వాలి సమీకరణాలు ఎలా ఉండాలి అనేది సీఎం కు దిశా నిర్దేశం చేయడానికి మీనాక్షి ని రంగంలోకి దించింది. వారం రోజుల పాటు సుదీర్ఘ సమీక్షలు చేసి అధిష్టానం కు నివేదించారు. శుక్రవారం ఇంచార్జ్ మీనాక్షి తో జరిగిన భేటీ లోనూ రేవంత్ రెడ్డి .
సుదర్శన్ రెడ్డి మాట ఇచ్చానని ఆయన అవకాశం ఇవ్వాలని పట్టు బట్టారు. ఈ భేటీ తర్వాతే సుదర్శన్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీ వెళ్లడం గమనార్హం. ఈసారి సామజిక సమీకరణ ల నేపథ్యంలో సుదర్శన్ రెడ్డి కి మంత్రి పదవి ఇవ్వడానికి అధిష్టానం నిరాకరించింది .
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు యేడాదిన్నర కాలం కావొస్తుంది. అయినప్పటికి రాష్ట్ర మంత్రి వర్గం లో జిల్లాకు ప్రాతినిధ్యమే లేకుండా పోయింది.
తోలి దఫా లోనే జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి మంత్రి పదవీ ఖాయం అని ప్రచారం జరిగింది. ఉమ్మడి జిల్లాలో నలుగురు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే లుగా గెలిచారు కానీ మిగితా ముగ్గురు మొదటి ఎమ్మెల్యే లుగా ఎన్నికయ్యారు.
కానీ సుదర్శన్ రెడ్డి సీనియర్ ఎమ్మెల్యే అదీగాక గతంలో మంత్రి గా పనిచేశారు.అందుకే ఆయన రేవంత్ క్యాబినెట్ లో కొలువు పక్క అనుకున్నారు. కానీ హైకమాండ్ మాత్రం ఆయను స్పీకర్ బాధ్యతలు అప్పగించడానికి సిద్ధం అయింది కానీ ఆయన స్పీకర్ పోస్టు తీసుకోవడానికి ఆయన ససేమిరా అన్నారు.
దీనితో మంత్రి పదవి కట్టబెట్టడానికి ఢిల్లీ పెద్దలు ఒప్పుకోలేదు. అందుకే ఆయన మంత్రి పదవీ పెండింగ్ లో పడింది. రేవంత్ రెడ్డి పట్టుబడుతున్న నేపథ్యంలో బిసి వాదం ను తెరమీదికి తెచ్చారు అదే సుదర్శన్ రెడ్డికి ఇప్పుడు ప్రతికూలంగా మారింది.
