HomeCRIMEదొంగల ముఠా అరెస్ట్...దొంగతనాలకు పాల్పడుతున్న ఓ ముఠాను పట్టుకున్నట్లు ఒకటవ టౌన్ సీఐ రఘుపతి పేర్కొన్నారు.ఆయన...

దొంగల ముఠా అరెస్ట్…దొంగతనాలకు పాల్పడుతున్న ఓ ముఠాను పట్టుకున్నట్లు ఒకటవ టౌన్ సీఐ రఘుపతి పేర్కొన్నారు.ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం..

జగిత్యాల జిల్లా కు చెందిన షైక్ యామిన్,ఆదిలాబాద్ కి చెందిన సయ్యద్ ఫరూక్ అలాగే మహారాష్ట్రకు చెందిన సత్య ముగ్గురు కలిసి ఓ ముఠాగా ఏర్పడి జిల్లాలో తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేసుకొని దొంగతనాలు చేస్తారని తెలిపారు.

వీరందరూ బాసర లో రూమ్ కిరాయి కి తీసుకొని, నిజామాబాదు లోదొంగతనాలు చేస్తున్నారు ఇందులో భాగంగా, రైల్వేస్టేషన్ లో పార్క్ చేసిన బైక్ ని దొంగతనం చేసి, అదే బైక్ పై ఏదైనా తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనం చేద్దామని నిజామాబాదు లో తిరుగుతున్న సమయం లో పోలీస్ వారు పట్టుకొని విచారించగ, వారు నలుగురు కూడా ఒక ముఠా గ ఏర్పడి ఏడపల్లి పీఎస్ లిమిట్స్ లో ఒక ఇంట్లో మరియు ఒక షాప్ లో తాళాలు పగులకొట్టి దొంగతనం చేసినట్లు తెలిపారు.

అదేవిదంగా 3 టౌన్ ఏరియా లో ఒక తాళం వేసి ఉన్న ఇంట్లో తాళం పగుల కొట్టి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు ఎత్తుకొని పోయినారు, ఇంకా జక్రానపల్లి లో ఒక బెల్ట్ షాప్ లో దొంగతనం చేసినరని ఒప్పుకొని ఇంకా ట్రైన్ లల్లో తిరుగుతూ మొబైల్ ఫోన్లు దొంగతనాలు చేసి A4 ఐన మన్మోహర్, మేడ్చల్ జిల్లాకు చెందిన అరవింద్ ప్రసాద్ ద్వారా అమ్మి వచ్చిన డబ్బులు అందరు పంచుకుంటారని వెల్లడించారు.

ఈ మేరకు నిందితుల నుంచి రూ 5000 నగదు,5 సెల్ ఫోన్లు,ఒక టీవీ,రెండు బైకులు, స్వాధీనం నిందితులను కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ రఘుపతి పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments