అర్ద రాత్రి దాక హోటల్ నడపడమే కాకుండా మూసేయాలని చెప్పినందుకు డ్యూటీ లో ఉన్న కానిస్టేబుల్ మీద ఓ మందు బాబు ఎదురు దాడి కి దిగాడు. ఈ ఘటన నగర శివారు లోని సారంగాపూర్ లో జరిగింది.
నగరంలో ఎలాంటి వ్యాపారలావాదేవీలైన సరే రాత్రి 11 గంటలే క్లోజ్ చెయ్యాలి. ఇది కొత్తగా వచ్చిన పోలీస్ కమిషనర్ ఆదేశాలు. ఇందులో భాగంగానే ఆరో టౌన్ పోలీసులు తమ పరిధి లో హోటళ్లు ఇతర షాప్ లను మూసేయించడానికి రోజు పెట్రోలింగ్ చేస్తున్నారు.
నిబంధనలు ఉల్లఘించే వారి మీద కేసులు నమోదు చేస్తున్నారు. ఆరో టౌన్ పోలీసులు శనివారం అర్ధ రాత్రి రోజుమాదిరిగానే పెట్రోలింగ్ చేస్తున్నారు సారంగాపూర్ భవాని హోటల్ వద్ద హడావుడి కనిపించడంతో ఆ షాప్ షెటర్ తెరిచి చూసారు. కొంత మంది భోజనాలు చేస్తున్నారు.
ఆ సీన్ చూసి అవాక్క అయ్యారు. వామ్మో అర్ద రాత్రి ఒంటి గంట సమయంలోనూ హోటల్ ఎలా నడుపుతారు అంటూ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేసారు.
భోజనం చేస్తున్న వారిని చెదర గొట్టారు అందులో ఇద్దరు మందు బాబులు ఓ కానిస్టేబుల్ తో గొడవ కు దిగాడు ఎహే నేను భోజనం చేశాకే వెళ్తా అంటూ అక్కడే కూర్చున్నాడు దీనితో బలవంతంగా బయటికి తీసుకొచ్చారు దీనితో సదరు మందు బాబు మెయిన్ రోడ్డు మీద కానిస్టేబుల్ మీద దాడికి దిగాడు.
ఇదో చోద్యం లా చూస్తున్న కొందరు వీడియో కూడా తీశారు. వ్యయ ప్రయాసలు పడి మందు బాబులను స్టేషన్ ను తరలించారు.ఇంత జరిగినా హోటల్ లో భోజనాలు యధావిధిగా సాగడం గమనార్హం
