HomeCRIMEఎంపీ గా గెలిచాక అర్వింద్ ను వెంటాడిన గులాబీ పెద్దలు ........ఫోన్ ట్యాపింగ్ ఉదంతం తో...

ఎంపీ గా గెలిచాక అర్వింద్ ను వెంటాడిన గులాబీ పెద్దలు ……..ఫోన్ ట్యాపింగ్ ఉదంతం తో బట్టబయలు ……….సన్నిహితులైన వ్యాపారులూ టార్గెట్ ……..ఓ మిల్లర్ ను ముప్పు తిప్పలు పెట్టారు

ఎంపీ ఎన్నికల్లోఅధికారంలో ఉన్న బిఆర్ యస్ సిట్టింగ్ కవిత ను ఓడించాక బీజేపీ ఎంపీ అర్వింద్ ను కెసిఆర్ సర్కార్ టార్గెట్ చేసింది. ఆయన కదలికలతో పాటు ఫోన్ లను సైతం ట్యాప్ చేసింది.

క్షేత్ర స్థాయిలో భౌతిక దాడుల కు సైతం గులాబీ శ్రేణులను ఉసిగొల్పారు.తాను నిఘా నీడలో ఉన్న విషయం పక్క సమాచారం ఉన్నాసరే అర్వింద్ ఒక్క అడుగుకూడా వెనక్కి వేయలేదు.

కెసిఆర్, కేటీఆర్, కవిత, లను ఉతికి ఆరేసేవారు. అందుకే ఆయను ఎక్కోడో ఓ దగ్గర ఇరికించడానికి సర్వ శక్తులు ఒడ్డారు. ఇందులో చివరి అస్రమే ఫోన్ ట్యాపింగ్. ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ కేసులో తాజాగా మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

కీలక నిందితుడు ప్రభాకర్ రావు ఎంట్రీ తో విచారణ లో మరిన్ని విస్తు గొలిపే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా రాజకీయ ప్రత్యర్థులను కెసిఆర్ సర్కార్ ఎలా వెంటాడిందో ట్యాపింగ్ ఉదంతం చెప్తుంది.

కెసిఆర్ సర్కార్ టార్గెట్ చేసిన ముఖ్య నేతల్లో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఉన్నారు.‌‌ ఆయన కు చెందిన రెండు ఫోన్‌‌ నంబర్లు ను ట్యాప్ చేసారు.

ఈ మేరకు ఫోరెన్సిక్ సైన్స్ల్యాబోరేటరీ (ఎఫ్‌‌ఎస్‌‌ఎల్‌‌) రిపోర్ట్‌‌ బయటపెట్టింది. అర్వింద్ తో పాటు ఆయన కు సన్నిహితంగా ఉండే అరడజన్ మంది కి చెందిన ఫోన్ డేటా ను ప్రణీత్ బృందం ఎప్పటికప్పడు విశ్లేషించేదట. ఓ రైస్ మిల్ వ్యాపారి అత్యంత ఆప్తుడిగా గుర్తించారు.

అందుకే అసెంబ్లీ ఎన్నికల సమయం లో అర్బన్ ఇంచార్జ్ గా ఉన్న ఎమ్మెల్సీ కవిత మిల్లర్ మీదికి విజిలెన్స్ అధికారులను పురమాయించారు. దీనితో హైదరాబాద్ నుంచి స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆయన మిల్ లో మూడు రోజులు పాటు సోదాలు చేశారు.

అంతే కాదు సివిల్ సప్లయి ఛైర్మెన్ రవీందర్ సింగ్ సైతం ఇక్కడే మకాం వేసి మిల్లర్ ను దారిలోకి తెచ్చుకోవడానికి శ్రమించారు. అప్పటి ఎమ్మెల్యే సైతం వ్యక్తి దాడి వద్దని కవిత ను వారించారు. చివరికి ఏమి దొరక్క ఉట్టి చేతులతో వెనుదిరిగారు.

దీనితో ప్రభుత్వ పెద్దలు తెల్లమొహాలు వేసుకోవాల్సి వచ్చింది. అయితే తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్న విషయం అర్వింద్ పసి గట్టారు. అందుకే ఫోన్ లో మాట్లాడే విషయంలో జాగ్రతగా వుండేది.

ఈ క్రమంలోనే స్పెషల్ ఆపరేషన్‌‌ టార్గెట్స్‌‌ (ఎస్‌‌ఓటీ) కేంద్రంగా జరిగిన ఫోన్‌‌ ట్యాపింగ్ గుట్టును సిట్‌‌ రట్టు చేస్తున్నది. కేసులో రెండో నిందితుడైన ప్రణీత్‌‌రావు సెల్‌‌ఫోన్‌‌ డేటాకు సంబంధించి ఎఫ్‌‌ఎస్‌‌ఎల్‌‌ రిపోర్ట్‌‌ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నది.

ఇందులో భాగంగా ప్రణీత్‌‌రావు శుక్రవారం సిట్‌‌ ముందు హాజరయ్యాడు.  ప్రస్తుతం బెయిల్‌‌పై ఉన్న ప్రణీత్‌‌రావును వారం రోజుల వ్యవధిలో మూడు సార్లు విచారించారు. ఫోన్ నంబర్లు, వాట్సాప్‌‌ చాటింగ్స్ను ముందుంచి ప్రశ్నిస్తున్నారు.

 ట్యాపింగ్ లో భాగంగానే ఎంపీ అర్వింద్ ముఖ్య అనుచరులపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు స్థానిక పోలీసులకు సమాచారం అందించేవారని సిట్‌‌ దర్యాప్తులో తేలింది.

ఫోన్ ల ట్యాపింగ్ లతో అర్వింద్ దూకుడు అడ్డుకునే పరిస్థితి లేక పోవడంతోనే ఆయన మీద జిల్లాలో భౌతిక దాడులకు సైతం బిఆర్ యస్ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని బీజేపీ నేతలు ధ్వజమెత్తారు.

ఆర్మూర్, డిచ్ పల్లి ప్రాంతాల్లో ఆయన ను లక్ష్యంగా చేసుకొనే కారు మీద దాడి చేసి విధ్వంసం సృష్టించారు.ఎంపీ అర్వింద్ పిర్యాదు చేసిన మొక్కుబడిగా చర్యలు తీసుకున్నారు. ఆయన ప్రాణాలకు ముప్పు వుందని కేంద్రమే రక్షణ ఏర్పాట్లు చేసింది.

అర్వింద్ సైతం ప్రైవేట్ సెక్యూరిటీ ని ఏర్పాటు చేసుకున్నారు. గులాబీ పెద్దలు అర్వింద్ ను ఎంత టార్గెట్ చేసారో ఫోన్ ట్యాపింగ్ ఉదంతం తో బట్టబయలు అయింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments