రోజువారీగా బ్యాంకు ల్లో నగదు జమ చేసే ఓ ఉద్యోగి రూ 45 లక్షల తో ఉడాయించాడు. బ్యాంకు అధికారుల పిర్యాదు మేరకు నాలుగో టౌన్ పోలీస్ లు కేసు నమోదు చేశారు.
ఆయా బ్యాంకు లకు చెందిన ఏటియం లల్లో నగదు జమ చేయడానికి ఈ టాస్ అనే ప్రయివేట్ సెక్యూరిటీ సంస్థ కాంట్రాక్ట్ ఫై పనిచేస్తుంది.
ఈ సంస్థ లో పనిచేసే రమాకాంత్ శనివారం ఉదయం ఎల్లమ్మ గుట్ట లోని వాహనం నుంచి ఏటియం లో వేయాల్సిన రూ 45 లక్షల నగదు ఎత్తుకొని పారిపోయాడు.
నిందితుడు నగరంలోని న్యాల్ కాల్ లో నివాసం వుంటున్నాడు. నాలుగో టౌన్ పోలీసు లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు
