ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్‌పై కేంద్ర సంస్థలతో సమగ్ర దర్యాప్తు జరపాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ డిమాండ్ చేసారు. ఈ మేరకు తెలంగాణ బీజేపీ కి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ లకు లేఖ రాసారు.
బిజెపి తెలంగాణ యూనిట్ వెంటనే డిమాండ్ చేయాలన్నారు . రేవంత్ రెడ్డి కెసిఆర్ కుటుంబంతో స్పష్టంగా కుమ్మక్కైనందున, తెలంగాణ ప్రభుత్వం నేరస్థులపై చర్యలు తీసుకునే అవకాశం లేదన్నారు తానూ మాత్రం ఈ ఉదంతం తీవ్రంగా కలత చెందనన్నారు .
ఇది కేవలం రాజకీయ ప్రతీకారం మాత్రమే కాదు, నేరపూరిత లక్ష్యంకూడా . 2019 నుండి, బిఆర్ యస్ గుండాలు బౌతికంగా అంతం చేయడానికి చూసారన్నారు .
ఈ కుంభకోణంపై తీవ్రమైన మరియు పారదర్శక దర్యాప్తు కోసమే తాను కోరుతున్నాను. వాటిని అధికారికంగా అంచనా వేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.
ఈ విషయం లోక్‌సభ స్పీకర్, కేంద్ర హోం మంత్రికి కూడా లేఖ రాస్తున్నాను.ఈ దాడి నాపై మాత్రమే కాదు, ప్రజాస్వామ్యం, ప్రజా ప్రతినిధుల గౌరవంపై దాడి.గా చూడాలన్నారు , ముఖ్యంగా హోం వ్యవహారాల శాఖ మంత్రిగా బండి సంజయ్ గారు, కేంద్ర దర్యాప్తు సంస్థలు
ఈ విషయాన్ని సీరియస్ తీసుకుని, కేసీఆర్ కుటుంబాన్ని మరియు ఇందులో పాల్గొన్న వారందరినీ శిక్షించే లా చూడాలని అర్వింద్ డిమాండ్ చేసారు .
